Animal Success Party: యానిమల్ సినిమా సక్సెస్ మీట్.. సెలబ్రెటీస్ తో హోరెత్తిచ్చిన భారీ పార్టీ

Animal Park: యానిమల్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. కాగా ఈ చిత్రం ప్రస్తుతం 800 కోట్ల క్లబ్బులో నిలిచి బ్లాక్ బస్టర్ స్టేటస్ సొంతం చేసుకుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 01:05 PM IST
Animal Success Party: యానిమల్ సినిమా సక్సెస్ మీట్.. సెలబ్రెటీస్ తో హోరెత్తిచ్చిన భారీ పార్టీ

 Animal Celebrations: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన చిత్రం యానిమల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, త్రిప్తి దిమ్రి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించి యువతను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఎన్నో ప్రశంసలు వాటితో పాటు ఎన్నో విమర్శలు కూడా తెచ్చుకుంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తగా మరి కొంతమంది పాతాళానికి తోసేలా విమర్శలు కురిపించారు. అయితే ఎవరు ఏమన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచే భారీగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో 800 కోట్ల క్లబ్బులో చేరింది.

యానిమల్ సినిమా సాధించిన ఈ భారీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సినిమా యూనిట్ ముంబైలో నిన్న రాత్రి భారీ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి యానిమల్ చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా విచ్చేశి అలరించారు. ఈ చిత్రం హీరో రణబీర్ కపూర్ తన భార్య ఆలియాతో కలిసి వచ్చాడు. అలాగే రష్మిక మందన్న, తమన్నా, మహేష్ భట్, నీతూ కపూర్, త్రిప్తి దిమ్రి, మానుషీ చిల్లర్, బాబీ డియోల్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. ఇంకా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సక్సెస్ పార్టీకి వచ్చి సందడి చేశారు. 

ఇలా ఆకాశాన్ని అంతేలా జరిగిన ఈ సంబరాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

తండ్రి సెంటిమెంట్, లవ్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో యానిమల్ సినిమా అందరినీ ఆకట్టుకొని..ఏకంగా 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి.. రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. అలాగే యానిమల్ సినిమాకి యానిమల్ పార్క్ అని సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ 2026 లో ఉండొచ్చని టాక్ నడుస్తోంది.

 

 

Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా

Also Read: Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళే 'గుంటూరు కారం' ట్రైలర్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News