Vijay-Rashmika: ఎంగేజ్మెంట్ కి సిద్ధమైపోయిన విజయ్- రష్మిక..ఎప్పుడో తెలుసా‌..

Vijay Devarakonda-Rashmika Mandanna Engagement: టాలీవుడ్ లో ఒక క్రేజీ కపుల్ గురించి.. ఎప్పటి నుంచో ప్రచారం జోరుగా జరుగుతుంది. కానీ వారిద్దరూ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా దాటేస్తూ వచ్చారు. అయితే ఈసారి వీళ్ళు సోషల్ మీడియా పుణ్యమా అని బాగా బుక్ అయిపోయారు. ఆ జంట ఎవరో గుర్తుపట్టారా?

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2024, 09:11 PM IST
Vijay-Rashmika: ఎంగేజ్మెంట్ కి సిద్ధమైపోయిన విజయ్- రష్మిక..ఎప్పుడో తెలుసా‌..

Vijay-Rashmika Engagement: టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ సెలబ్రిటీలు చాలామంది పెళ్లి పీటలు ఎక్కారు. గుట్టుగా సాగిస్తున్న తమ ప్రేమాయణానికి పుల్ స్టాప్ పెట్టి మెగా కపుల్ వరుణ్ తేజ్ ..లావణ్య త్రిపాఠి కూడా ఏడడుగులు నడిచేశారు.మనోజ్-మౌనిక, శర్వానంద్-రక్షితా రెడ్డి.. ఇలా చాలా జంటలు పెళ్లి పుస్తకాన్ని లాస్ట్ ఇయర్ మొదలుపెట్టేసారు. అయితే ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్నారు అని ప్రచారం జరుగుతున్న ఒక జంట మాత్రం ఇంకా తమ రిలేషన్ ని బయట పెట్టలేదు. కాగా ఆ కపుల్ మరెవరో కాదు విజయ్ దేవరకొండ, రష్మిక. 

గత కొద్ది కాలంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు వీరిద్దరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా సేమ్ టు సేమ్ ఒకే ప్రదేశంలో ..ఒకే టైంలో తీసుకున్న విధంగా ఉండడం ఈ అనుమానాన్ని మరింత పెంచింది. ప్రతి ఫెస్టివల్ ని రష్మిక ..విజయ్ దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంది అనే వార్తను  కొందరు నెటిజెన్స్ వారిద్దరి సోషల్ మీడియా పోస్టులు షేర్ చేస్తూ పక్క ప్రూఫ్ తో వైరల్ చేశారు. ఆఖరికి హాయ్ నాన్న ఈవెంట్ లో కూడా.. వీళ్ళిద్దరి మాల్దీవ్స్ ట్రిప్ కి సంబంధించిన గాసిప్ ఫోటో స్క్రీన్ పై చూపించారు. బాలకృష్ణ టాక్ షో కి వెళ్లిన రష్మిక.. విజయ్ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయింది.

అయితే కొత్త సంవత్సరం ఈ ప్రేమ జంట.. పెళ్లి చేసుకొని కొత్తజంటగా మారిపోతుంది అని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా అతి త్వరలో జరగబోతున్నట్లు టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చేనెల వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి గుడ్ న్యూస్ మనం వినే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరి పెళ్లి గురించి ఒక నిర్ణయానికి వచ్చినా కుటుంబ సభ్యులు వచ్చే నెల రెండవ వారంలో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోపక్క ఇంత జరుగుతున్నా ఇటు విజయ్ ..అటు రష్మిక ఇద్దరిలో ఎవరు స్పందించడం లేదు.ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్ వార్తలా లేక నిజంగానే వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ తేదీని ఫిబ్రవరిలో ప్రకటిస్తారా? అన్న విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాలి.

Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే

Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News