Hanuman OTT Rights: ఊహించని ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Hanuman OTT Release: పాన్ వరల్డ్ సినిమా హనుమాన్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో బొమ్మ పడినప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 02:08 PM IST
Hanuman OTT Rights: ఊహించని ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Hanuman OTT Rights Price: తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ రిలీజ్ తో సంక్రాంతి సందడి మెుదలైంది. రిలీజ్ ముందు నుంచే ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది హనుమాన్. దానికి తగినట్లుగానే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై జనాల్లో వీర లెవల్లో అంచనాలను పెరిగిపోయాయి. ఇవాళ (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది హనుమాన్. అయితే జనవరి 11 సాయంత్రం నుంచే ఈసినిమాకు భారీగా ప్రీమియర్స్ పడినట్లు తెలుస్తోంది. బొమ్మ పడినప్పటి నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అందరూ నోట బ్లాక్ బాస్టర్ అనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 ఈ మూవీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఈ మూవీ ఓటీటీ హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  హనుమాన్ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. 

Also Read: Hanuman Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం

తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ, వినయ్ రాయ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తేజా నాలుగో సినిమాకే ఇంత భారీ స్థాయిలో ఓటీటీ హక్కులు అమ్మడుపోవడం రికార్డనే చెప్పాలి. పండగ సెలవులు కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. 

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... 'కల్కి' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News