Ayodhya Tour Package: రాములోరి భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం అయోధ్యకు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తక్కువ ధరలలో ఈ ప్యాకేజీలను మీ ముందుకు తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు అయోధ్యలోని రామాలయం నుండి ప్రారంభమయి.. ప్రయోగ్ రాజ్ తోపాటు మరో మూడు జ్యోతిర్లింగాలకు ప్రయాణం చేయనుంది. ఇందులో మరికొన్ని ప్రదేశాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది.
టూర్ ఎప్పుడు ప్రారంభం?
ఈ యాత్ర ఫిబ్రవరి 05, 2024 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో ప్రయాగ్‌రాజ్, అయోధ్య, వారణాసి, చిత్రకూట్, నాసిక్ మరియు ఉజ్జయిని మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం పొందుతారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుండి సురేంద్రనగర్, విరామ్‌గామ్, ఆనంద్, ఛాయాపురి, నదియాడ్, దాహోద్, గోద్రా, రత్లాం మరియు మేఘనగర్ నుండి ప్రయాణీకులు బోర్డింగ్ సౌకర్యం పొందుతారు.
ప్యాకేజీ వివరాలు..
**ఈ ప్యాకేజీ 10 పగళ్లు మరియు 9 రాత్రులు ఉంటుంది.
·**ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా.. భారత్ గౌరవ్ ప్రయాణం రైలులో ప్రయాణం ఉంటుంది. ఇందులో ప్రయాణికులు ఎకానమీ ఏసీ, 3 ఏసీ, 2 ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వీలుంది.
**ప్రయాణికులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం ఉంటుంది.
**·ఛార్జీల ప్రకారం, మీరు AC మరియు నాన్-AC హోటళ్లలో బస చేయడానికి అవకాశం పొందుతారు.
**దేవాలయాలకు వెళ్లేటప్పుడు బస్సు సౌకర్యం కూడా కల్పించబడుతుంది.
టికెట్ ధర ఇదే..
ఈ టూర్ ప్యాకేజీలో, రైలులోని వివిధ కోచ్‌ల ప్రకారం వేర్వేరు ఛార్జీలు నిర్ణయించబడ్డాయి. సుపీరియర్ క్లాస్ టికెట్ కోసం ఒక్కొక్కరికి రూ.46,000, కంఫర్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణించేందుకు రూ.33,000, ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలుకు రూ.20,500 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: Ayodhya: భవ్యరామమందిరం ప్రారంభోత్సవం.. ముస్లిం ఫ్యామిలీ తమ బాలుడికి ఏంపేరు పెట్టారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook