Railway Lands Issue: హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేందుకు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు చోట్ల కొత్త టెర్మినళ్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ నిర్మాణ పనులకు భూమి సమస్య ఏర్పడడంతో ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూముల విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్, మౌలాలీ రైల్వేస్టేషన్లకు అదనపు భూమి కేటాయించాలని లేఖలో కోరారు.
ఈ సందర్భంగా నగరంలో రైల్వే శాఖ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదించారు. రైల్వే శాఖ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు (15 జూన్, 2022), (7 మార్చి 2023)న లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని కిషన్ రెడ్డి కోరారు.
లేఖలో ప్రధాన అంశాలు
- చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో టెర్మినల్ నిర్మాణం, అదనపు ప్లాట్ ఫాం ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. స్టేషన్ వెలుపల ఇరువైపులా అప్రోచ్ రోడ్డును విస్తరించాలి. పార్కింగ్ తదితర అవసరాల కోసం అదనపు భూమి కేటాయించాలి.
- ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్త స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేయాలి.
- భరత్‌నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వచ్చే రహదారిని 30 అడుగుల నుంచి 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి.
- ఈసీ నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్‌లోని ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫామ్‌ను చేరుకునే రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాల్సి ఉంది.
- చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫామ్ వైపు 2.7 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉంది.
- చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్లను రైల్వే శాఖ ఇప్పటికే జమ చేసింది. ఈ నీటి కనెక్షన్‌ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలి.
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఆల్ఫా హోటల్ నుంచి రేతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలి.
- మౌలాలీ యార్డ్ స్టేషన్ పరిధిలో స్టేషన్‌కు ఇరువైపులా నివాసితుల మురుగు నీరు రాకుండా డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడున్న 2 మీటర్ల నుండి 4.8 మీటర్లకు విస్తరించాలి.
Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి