Telangana: వావ్.. ఒకటో తేదీన పడ్డ శాలరీలు.. నా భార్య కూడా నమ్మడం లేదంటూ ఎక్స్ లో పోస్టు చేసిన ప్రభుత్వ ఉద్యోగి..

CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత కాలంగా శాలరీలు చాలా ఆలస్యంగా పడుతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తలలు పట్టుకున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 2, 2024, 12:38 PM IST
  • - తెలంగాణలో ఒకటో తారీకున పడ్డ శాలరీలు..
    - ఆనందంలో ప్రభుత్వ ఉద్యోగులు..
    - ఇదే కదా.. ప్రజాపాలన అంటూ కామెంట్ లు..
Telangana: వావ్..  ఒకటో తేదీన పడ్డ శాలరీలు.. నా భార్య కూడా నమ్మడం లేదంటూ ఎక్స్ లో పోస్టు చేసిన ప్రభుత్వ ఉద్యోగి..

Congress Government Rule: మనలో చాలా మంది సర్కారు కొలువు టార్గెట్ గా పెట్టుకుని కష్టపడి చదువుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తుంటారు. అయితే.. సర్కారు కొలువంటే ఒకటో తారీఖున జీతం, అనేక సదుపాయాలు, సమాజంలో మంచి గౌరవం ఉంటుందని అందరు అనుకుంటారు. ఇంకా సర్కారు జాబ్ కు ఉంటే క్రేజ్ వేరుగా ఉంటుంది. అయితే..తెలంగాణలో  గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు జీతం ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసేవారు. 

చాలా సార్లు నెలలోని రెండో వారం, లేదా పదో తేదిన శాలరీలు పడేవి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులై కూడా డబ్బుల కోసం వెచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది సర్కారు ను తిట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో  వచ్చాక అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అనేక శాఖలను ప్రక్షాళన చేసి పరిపాలనను మెల్లగా గాడిలో పెడుతుంది.  

Read Also: Dating: ''వామ్మో.. 9 th క్లాసు పుస్తకంలో డేటింగ్ పై పాఠాలు..?.." సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్న నెటిజన్లు..

ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జీతాలు పడ్డాయి. దీంతో ఇది నిజామా.. లేక కలనా.. ?.. అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే కాంగ్రెస్ వచ్చాక  పాలనలో పెనుమార్పులు కన్పిస్తుందని కూడా చెబుతున్నారు. దీనికి  సంబంధించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్స్ లో చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఎంత మార్పు అంటూ కూడా అందులో రాసుకొచ్చాడు. ప్రజాపాలన అంటే ఇదేకదా.. థైంక్స్ సీఎం రేవంత్ రెడ్డి సర్ అంటూ కూడా రాసుకొచ్చాడు.  ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News