Trivikram Next Film: సంక్రాంతి బరిలో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన చిత్రం గుంటూరు కారం. మొదటి షో నుంచే మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ స్టోరీ కూడా ముగుస్తోంది. మూవీ విడుదలైనప్పటి నుంచి త్రివిక్రమ్ ఎక్కడ కనిపించడం లేదు. ఇంటర్వ్యూలు దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రెస్ మీట్ దగ్గర నుంచి సక్సెస్ పార్టీ వరకు.. ఎందులోనూ అతను పాలుపంచుకోలేదు. మరోపక్క మూవీ ప్రమోషన్ బాధ్యతను మొత్తం భుజాల మీద ఎత్తుకున్న నాగవంశీ.. అన్ని దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. సడన్గా డైరెక్టర్ ఇలా సైలెంట్ అయిపోవడం పై పలు రకాల కథనాలు వినిపించాయి.
వాటితో పాటుగా త్రివిక్రమ్ రాబోయే ప్రాజెక్ట్ గురించి కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నాయి. ఇక ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ప్రస్తుతం తను చేయబోయే చిత్రాల గురించి జరుగుతున్న గాసిప్ విని త్రివిక్రమ్ నవ్వుకుంటున్నాడట. త్రివిక్రమ్ .. పవన్ కళ్యాణ్ హీరో గా ..ఓ మీడియం బడ్జెట్ మూవీ తీయబోతున్నాడని.. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ని కూడా రాసుకున్నారని ఒకపక్క టాక్. మరోపక్క రాజమౌళి కంటే ముందు మహేష్ బాబుతో త్రివిక్రమ్ మరొక మూవీ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.
మరికొందరైతే నేచురల్ స్టార్ నాని , వెంకీ మామ కాంబోలో మల్టీ స్టార్ చేస్తాడు గురూజీ అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వీటిలో ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే త్రివిక్రమ్ కి ప్రెసెంట్ ఏ మూవీ చేసే ఆలోచన లేదు. కేవలం అఫీషియల్ గా కమిట్ అయిన అల్లు అర్జున్తో తప్ప గురూజీ ఇప్పట్లో ఇంకెవరితో చేయడానికి ఫిక్స్ అవ్వలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ తో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఫలానా టైం కి స్క్రిప్ట్ రెడీ చేయాలి.. వెంటనే మూవీ మొదలు పెట్టాలి అని ఒత్తిడి ఏమాత్రం లేదు. గుంటూరు కారం విషయంలో జరిగిన లోటుపాట్లను గురూజీ నెక్స్ట్ మూవీ లో ఏ రకంగా కవర్ చేస్తారో చూడడానికి ఇంకా కాస్త సమయం ఉంది.
విశ్వక్ సేన్ హీరో గా సితార బ్యానర్ పై తెరకెక్కించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి చిత్రం ఫైనల్ కాఫీ త్రివిక్రమ్ కి చూపించాలని నాగ వంశీ ప్లాన్ చేస్తున్నారట. మూవీకి సంబంధించి గురూజీ సలహాలు తీసుకొని.. ఆ బేసెస్లో ఎడిటింగ్ పరంగా మార్పులు చేయాలి అని అతని ఉద్దేశం అంట. మరోపక్క త్రివిక్రమ్.. పద్మభూషణ్ వచ్చిన చిరంజీవిని కలిసినప్పుడు తప్ప తిరిగి మల్ల కెమెరా కంటికి చిక్కలేదు. మొత్తానికి గురూజీ మౌనం వెనక కారణం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook