Union Bank Of India Jobs: ఉద్యోగాల కోసం అన్వేషించే నిరుద్యోగులు ప్రభుత్వ శాఖల్లో కన్నా బ్యాంకింగ్ రంగాన్ని నమ్ముకుంటే వెంటనే ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ గుర్తింపు బ్యాంకుల్లో ఉద్యోగం కొడితే మీ జీవితం స్థిరపడ్డట్టే. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే తెలియదు కానీ ప్రతియేటా బ్యాంక్ ఉద్యోగాలు మాత్రం తప్పనిసరిగా పడతాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు భర్తీ అవుతుంటాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే తొలి సంపాదనే రూ.89,000 పొందుతారు. ఆ ఉద్యోగ ఖాళీలు, వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..
బ్యాంకులో ఉద్యోగమంటే వినియోగదారులకు సేవలు అందించేదే అనుకుంటారు. కానీ ఒక బ్యాంక్ పని చేయాలంటే బ్యాకెండ్‌లో ఎన్నో విభాగాలు పని చేస్తుంటాయి. వినియోగదారులకు సత్వరమే సేవలు అందించేందుకు అనేక విభాగాలు పని చేస్తుంటాయి. వాటిలోనే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్వాలిటీ అసూరెన్స్ లీడ్, ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్, ఎజైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, డీఎస్‌వో ఇంజనీర్ తదితర విభాగాల్లో యూనియన్ బ్యాంకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు
అర్హతలు
ఈ ఉద్యోగానికి సంప్రదాయ డిగ్రీ కోర్సులు కాకుండా సాంకేతిక విద్య చదివిన వారు అర్హులు. నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ ఉద్యోగాల్లో అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు వయో పరిమితులు ఉన్నాయి. యథావిధిగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంది. దివ్యాంగులకు పదేళ్ల వయసు మినహాయింపు ఇచ్చారు.
మొత్తం పోస్టులు: 606
అర్హతలు: బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎమ్మెస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, బృంద చర్చలు, అప్లికేషన్స్ స్క్రీనింగ్, భౌతిక ఇంటర్వ్యూ
దరఖాస్తుల ప్రారంభం: 03-02-2024
దరఖాస్తుల తుది గడువు: 23-02-2024
దరఖాస్తు ఎలా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా ఐబీపీఎస్ వెబ్‌సైట్
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, చండీగడ్/మొహలీ, లక్నో, కోల్‌కత్తా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, అహ్మదాబాద్/ గాంధీనగర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి