Upasana: 'తనని చూస్తే నాకు జెలసి'.. అసలు విషయం బయట పెట్టిన ఉపాసన

Ram Charan: రామ్ చరణ్ భార్య గానే కాదు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీ ఉపాసన. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. కాగా ఉపాసన రామ్ చరణ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 07:52 AM IST
Upasana: 'తనని చూస్తే నాకు జెలసి'.. అసలు విషయం బయట పెట్టిన ఉపాసన

Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, ప్రతాప్ రెడ్డి మనవరాలు గానే కాకుండా.. ఉపాసన తన సేవల ద్వారా అలానే తన ఫ్యాషన్స్ ద్వారా సోషల్ మీడియాలో తనకంటూ ఎంతో ఫాలోయింగ్ తెచ్చిపెట్టుకుంది. ఉపాసన ప్రస్తుతం అపోలో భాద్యతలు కూడా చూసుకుంటుంది. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఎన్నో విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకునే ఉపాసన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి అలానే తన కూతురు క్లిన్ కారా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

ఉపాసనని ఈమధ్య ఇంటర్వ్యూలో ఒక యాంకర్..’అమ్మాయిలు నాన్న కూచీ అంటారు.. అది నిజమేనా మీ పాప విషయంలో కూడా’ అని అడగగా.. ఉపాసన దానికి సమాధానం ఇస్తూ అది పక్కా నిజమైన స్టేట్మెంట్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు అందుకే తను చాలా జలసిగా ఉన్నాను అని తెలియజేసింది ఉపాసన. ‘అది చాలా కరెక్ట్ స్టేట్మెంట్. దాని గురించి నాకు చాలా జలసీగా ఉంది. మన కనిపిస్తే చాలు కళ్లల్లో స్పార్క్ వస్తుంది.. మొహంలో నవ్వొస్తుంది.. నాకు అదంతా చూస్తే హె కమాన్ అనుకుంటూ ఉంటాను' అంటే తమాషాగా రామ్ చరణ్ కి క్లీన్ కారాకి మధ్య ఉండే ప్రేమ గురించి అసలు విషయం బయట పెట్టింది ఉపాసన.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SCREENPLAY.IN (@screenplay.in)

కాక ఉపాసనకి రామ్ చరణ్ కి పెళ్లి అయిన 11 సంవత్సరానికి క్లీన్ కారా జన్మించిన సంగతి తెలిసిందే. మరి అన్ని రోజులు ఆలస్యం ఎందుకయింది అనే విషయాన్ని కూడా ఉపాసన ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ..’తల్లి కావడం చాలా గ్రేట్. ఆ విషయంలో మేము ఇంకా గ్రేట్, ఎందుకంటే? పెళ్లై ఇన్ని రోజులు అవుతుంది? ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు? ఏదైనా సమస్య ఉందా? అని చాలా వార్తలు వచ్చాయి. కానీ మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి అనుకున్నాం.. అందుకే ఇంత సమయం తీసుకున్నాం’ అని తెలియజేసింది ఉపాసన.

ఇక రామచరణ్ సినిమా విషయాలకు వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత ఆచార్య చిత్రంతో ఘోర పరాజయం చలి చూశారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కాగానే ఈ హీరో బుచ్చిబాబు సానా చిత్రంలో పాల్గొననున్నారు.

Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..

Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News