ICC Rankings 2024: ఐసీసీ టెస్టు, వన్డే, టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, టెస్టుల్లో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో అప్ఘానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. గత 1,739 రోజులుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ ను వెనక్కి నెట్టి నబీ అగ్ర స్థానాన్ని ఎగరేసుకుపోయాడు.
ఇక టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే.. టెస్టుల్లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల కేటగిరీలో అగ్రస్థానంలో ఉంటే.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ ఐదో స్థానం దక్కించుకున్నాడు. వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 10వ ర్యాంకును దక్కించుకున్నాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 07 స్థానంలోనూ ఉన్నాడు. మరోవైపు వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ 2వ స్థానంలో ఉండగా..విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ అగ్రస్థానంలోనూ..యశస్వీ జైస్వాల్ 6వ ర్యాంకులోనూ ఉన్నారు.
వన్డే క్రికెట్:
టాప్ బ్యాటర్: బాబర్ ఆజం (పాకిస్థాన్)
టాప్ బౌలర్: కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా)
టాప్ ఆల్ రౌండర్: మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్)
టెస్ట్ క్రికెట్:
టాప్ బ్యాటర్: కేన్ విలియమ్స్ (న్యూజిలాండ్)
టాప్ బౌలర్: జస్ప్రీత్ బుమ్రా (భారత్)
టాప్ ఆల్ రౌండర్: రవీంద్ర జడేజా (భారత్)
టీ20 క్రికెట్:
టాప్ బ్యాటర్: సూర్యకుమార్ యాదవ్ (భారత్)
టాప్ బౌలర్: ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
టాప్ ఆల్ రౌండర్: షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
Also Read: IND vs ENG 03rd Test: రాజ్‌కోట్ టెస్టుకు టీమ్ ను ప్రకటించిన ఇంగ్లండ్.. తిరిగొచ్చిన స్టార్ పేసర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook