Constipation Problem: మలబద్ధకం సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ !

Instant Constipation Relief Medicine: మలబద్ధకం అనేది చాలా సాధారణమైన జీర్ణ సమస్య. ఇది  చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారికి ఈ చిట్కాలు సహాయపడతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 12:10 PM IST
Constipation Problem: మలబద్ధకం సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ !

Instant Constipation Relief Medicine: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్య మలబద్దం. వేయించిన ఫుడ్‌, జీర్ణం కాని  ఆహార పదార్థాలు తీసుకోవడం, కొవ్వు కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ మలబద్దం సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల మలబద్దం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అయితే మలబద్దం సమస్యతో బాధపడుతున్నవారు ఫైబర్‌ కంటెంట్‌తో కూడిన ఆహార పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆకు కూరలు, పండ్లు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

కొంతమంది మలబద్దం సమస్య ఉన్నప్పుడు మార్కెట్‌లో లభించే మందులు, ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ వల్ల కొంత ఉపశమనం లభించిన సమస్య తగ్గదు. ఇక్కడ చెప్పిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మలబద్దం సమస్య బారిన పడకుండా ఉండేలా చేయవచ్చు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం..

మలబద్దం తగ్గించే ఆహారం:

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు: 

పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, గింజలు ,  తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మలబద్ధకం నివారణకు చాలా ముఖ్యమైనవి. రోజుకు కనీసం 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవడానికి ప్రయత్నించండి.

నీరు: 

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి.

కొవ్వు పదార్థాలు తగ్గించండి: 

అధిక కొవ్వు పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి. మలబద్ధకానికి దారితీస్తాయి.

కెఫిన్ మరియు ఆల్కహాల్ తగ్గించండి:

కెఫిన్,  ఆల్కహాల్ డీహైడ్రేషన్ కలిగిస్తాయి, ఇది మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: 

వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.

క్రమం తప్పకుండా మలవిసర్జనకు వెళ్లండి:

ప్రతిరోజూ ఒకే సమయంలో మలవిసర్జనకు వెళ్లడానికి ప్రయత్నించండి.

ఒత్తిడిని నిర్వహించండి: 

ఒత్తిడి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాల వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించండి.

Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News