Gaami: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అఘోర పాత్రలు కనిపించబోతున్న చిత్రం గామి. విద్యాధర్ కాగితా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.
సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా వచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నేను ఎవరిని నాకు ఈ సమస్య అసలు ఎప్పుడు వచ్చింది అనే విశ్వక్‌సేన్ డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో చూపించిన కథ విషయానికి వస్తే ఈ సినిమాలో విశ్వక్ ఒక అఘోరా పాత్రలో కనిపించాడు. తను ఒక సమస్యతో బాధపడుతూ ఉండగా.. అతను ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధించి ఒక ప్రదేశానికి చేరుకోవాలి అని చెబుతారు ఆయన గురువు. ఆ పనిపైనే అక్కడికి కథానాయకుడు బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనేదే కథ.
మరో విశేషం ఏమిటి అంటే ఈ ట్రైలర్లో హీరో పాత్రతో పాటు మరో రెండు పాత్రలను కూడా చూపిస్తూ వచ్చాడు. ఒక పాత్ర ఒక ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు. అసలు ఈ రెండు పాత్రలకు హీరో పాత్రకి సంబంధం ఏమిటి.. మధ్యలో హీరోయిన్ చాందిని చౌదరి పాత్ర వెనుక కథ ఏమిటి అని ఎన్నో సందేహాలతో ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ ని ముగించాడు. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
మరి మార్చ్ 8న థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. కాగా ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్నారు. నరేష్ కుమరాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా కనిపించబోతుంది. వీరు మాత్రమే కాకుండా అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter