లక్ష్మీనారాయణకు ఆప్, బీజేపీల నుంచి ఆహ్వానాలు

                       

Last Updated : Oct 27, 2018, 09:51 AM IST
లక్ష్మీనారాయణకు ఆప్, బీజేపీల నుంచి ఆహ్వానాలు

రాజకీయ ఆరంగేట్రం కోసం సిద్ధమైన రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటనలు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రజా సమస్యలపై కొంతమేరకు అవగాహనకు వచ్చారు.  ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పదమూడు జిల్లాల్లో తాను అధ్యయనం చేసిన అంశాల పరిష్కారం కోసం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తాన్నారు. త్వరలోనే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగుతానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఇప్పటికే  తనకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తన రాజకీయ ఆరంగేట్రంపై తన  శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నానని పేర్కొన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ..తర్వలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే తాను సొంతగా పార్టీ పెడతారా.. లేదంటే ఇతర పార్టీల్లో చేరుతారా అన్న దానిపై లక్ష్మీనారాయణ క్లారిటీ ఇవ్వలేదు.  సొంతంగా పార్టీ పెట్టడమా..లేదంటా ఏదైన పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమా అనే ఆప్షన్లలో ఆయన ఏదో ఒక దారి చూసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ తన పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయవర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

 

Trending News