Gummanur Jayaram Resigns to YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ టికెట్ దక్కని నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. ఆ పార్టీలో నాయకులు ఇటు.. ఈ పార్టీలో నేతలు ఆ పార్టీలో అటు జంప్ అవుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఇంఛార్జ్‌ల మార్పుల్లో ఆయన ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేని గుమ్మనూరు.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినా వైసీపీ అధిష్టానం ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
విజయవాడలో సోమవారం గుమ్మనూరు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానాలతో విసుగుచెందానని చెప్పారు. వైసీపీ కోసం కరుడుగట్టిన తీవ్రవాదిగా పనిచేశానని అన్నారు. 'జగన్ మారిపోయారు. గుడిలో విగ్రహంలా అయిపోయారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు (ధనుంజయరెడ్డి, సజ్జల) ఉన్నారు. వాళ్లు చెప్పిందే జగన్ చేస్తారు. ముఖ్యమంత్రికి భక్తుడిని అయినా న్యాయం జరగలేదు. జిల్లాలో నేను, బుగ్గన మంత్రులుగా ఉంటే.. డోన్ ఎలా అభివృద్ధి చెందింది..? నా నియోజకవర్గం ఎలా ఉంది. ఇది చాలా అవమానంగా భావిస్తున్నా' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్ అడిగారని గుమ్మనూరు తెలిపారు. తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానని అన్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో తన అనుచరులతో ఆయన విజయవాడకు విచ్చేశారు. ఆలూరు టికెట్ కోసం ఇప్పటికే పోటీ ఎక్కువ ఉండడంతో గుమ్మనూరును గుంతకల్లు నుంచి బరిలో దింపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోగా.. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఆలూరు టికెట్‌ను విరుపాక్షికి కేటాయించడంతో గుమ్మనూరు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter