Ind vs Eng 05th Test Updates: మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు గాయం కారణంగా టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. రీసెంట్ గా లండన్ లో సర్జరీ చేయించుకుని ఇండియాకు తిరిగొచ్చాడు రాహుల్. ఉప్పల్ టెస్టులో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాల్గో టెస్టులో రాహుల్ 90% ఫిట్‌గా ఉన్నట్లు తెలిపారు. అయితే జట్టు మేనేజ్ మెంట్ అతడిని పక్కన పెట్టింది.
రాహుల్ ఐపీఎల్ ఆడతాడా?
తాజాగా రాహుల్ శస్త్రచికిత్స సక్సెస్ అవ్వడంతో.. అతడు ఐపీఎల్ లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలంటే పక్కాగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బీసీసీఐ రూల్స్ ప్రకారం, గాయపడిన టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనాలంటే జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్నెస్ టెస్ట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం, ఇప్పుడు ఐపీఎల్‌కు ముందు కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ పరీక్షలో రాహుల్ విఫలమైతే ఐపీఎల్‌కు దూరం అవుతాడు.
తాజాగా రాహుల్ ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయ్యేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయితేనే రాహుల్ ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా నికోలస్ పూరన్ వ్యవహారించనున్నాడు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా ఉండేవాడు, కానీ ఆ సారి బాధ్యతలను వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కు అప్పగించారు.
Also Read: Indian Cricketer: ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్పిన్నర్
Also Read: R Ashwin: 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న అశ్విన్.. ఇప్పటి వరకు సాధించిన ఘనతలివే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook