Techie Girl Commit Suicide In Gachibowli: కొందరు యువతీ యువకులు, పెళ్లిళ్ల విషయంలో ఎటు తెల్చుకోలేక పోతున్నారు. ఈ మధ్య కాలంలో సూసైడ్ లో ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. యువత.. తమ ప్రేమవ్యవహరాలను పెద్దలకు చెప్పలేక, అలాగని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొవడం ఇష్టంలేక సూసైడ్ లకు పాల్పడుతున్నారు. అస్సలు తమ మనస్సులో ఉన్న విషయాలను పెద్దలతో కనీసం మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడంలేదు. ఎంతో కష్టపడి తొమ్మిది నెలలు కని పెంచి, పెద్ద చేసిని వదిలేసి, సూసైడ్ లు చేసుకుంటున్నారు.
Read More: Healthy Drinks: పొట్టను శుభ్రం చేసే 3 డ్రింక్స్.. కేవలం 10 రోజుల్లో బరువు కూడా తగ్గొచ్చు..!
తాజాగా, హైదరాబాద్ లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలీలోని కొత్తగూడలో విద్యాశ్రీ అనే యువతి సోమవారంరోజు బాత్రూమ్ లో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్లా కు చెందిన విద్యాశ్రీ అనేయువతి గచ్చి బౌలీలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఈ నెల మార్చి 17న యువతి పెళ్లి నిశ్చయమైంది.
కాబోయే భర్తతో గురువారం ప్రీవెడ్డింగ్ షూట్ కు కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఏమైందో ఏంటో యువతి సోమవారం బాత్రూమ్ లో టవల్ తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత సేపటికి యువతి బాత్రూమ్ నుంచి బైటకు రాకపోవడంతో తోటి రూమ్ మెట్స్ హస్టల్ నిర్వాహలకు సమాచారం ఇచ్చారు. వెంటనే కిటీకి నుంచి చూడగా యువతి షవర్ బాత్ కు వేలాడుతూ కన్పించింది. హస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాత్రూమ్ డోర్ లు పగలగొట్టి యువతిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పదిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువతి కాస్త.. ఇలా పాడె ఎక్కడం అందరినీ కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టారు.
Read More: Pooja Hegde: హాట్ ఫోటోషూట్స్‌తో పూజా హెగ్డే రచ్చ.. బుట్టబొమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..
పెళ్లికి కొద్ది రోజుల ముందే యువతి సూసైడ్ చేసుకొవడం తీవ్ర దుమారంగా మారింది. యవతికి ఏమైన లవ్ ఎఫైర్ లు ఉన్నాయా.. పెళ్లి ఇష్టంలేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. యువకుడు ఏమైన యువతిని వేధించాడా.. లేదా మరేదైన కుటుంబపరమైన ఒత్తిళ్లు ఉన్నాయా..? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter