బీచ్ సిటీ వైజాగ్ సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. జాతీయ తీర పరిశోధన సంస్థ (నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్)ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ముందడుగు పడుతోంది. నవంబర్ 2న యారాడ కొండపై కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.
పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు తీర ప్రాంతంలో చోటుచేసుకుంటున్న మార్పులు, తుఫాన్లపై ఈ కేంద్రం అధ్యయనం చేయనుందని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.