Kannappa: కన్నప్ప కామిక్ బుక్.. ఇంస్టాగ్రామ్ మెసేజ్ పెడితే చాలు..అందరికీ ఫ్రీ

Kannappa Free Comic Book: వరుస ప్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణు ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని కసిపైనా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2024, 03:40 PM IST
Kannappa: కన్నప్ప కామిక్ బుక్.. ఇంస్టాగ్రామ్ మెసేజ్ పెడితే చాలు..అందరికీ ఫ్రీ

Manchu Vishnu: మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు ఆ తరువాత పలు చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ హీరోకి పెద్దగా విషయాలు అయితే తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో ప్రభాస్, నయనతార లాంటి నటులు జాయిన్ కావడం.

ఈ చిత్రంలో నుంచి మంచు విష్ణు మొదటి లుక్ కూడా ఈ మధ్య విడుదలై ఆకట్టుకుంది తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా మంచు విష్ణు కన్నప్ప గురించి ఒక ఆసక్తి ఇక్కడ విషయం తెలియజేస్తూ వీడియో షేర్ చేశాడు. 

ఈ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప సినిమా గురించి, ఆయన ఎవరు, అతని చరిత్ర ఏంటి అని చాలామంది నన్ను తరచూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు కోసం కన్నప్ప చరిత్ర, శ్రీకాళహస్తి చరిత్ర తెలిపేలా కన్నప్ప పేరుతో ఓ కామిక్ బుక్ రిలీజ్ చేయబోతున్నాను. అమర్ చిత్ర కథ సహాయంతో కన్నప్ప కామిక్ బుక్ ని మా నాన్న పుట్టిన రోజు మార్చ్ 19న రిలీజ్ చేయబోతున్నాను. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఒక మెసేజ్ పెట్టేయండి. నా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయి మీకు ఉచితంగా పుస్తకం పంపిస్తారు. దీనికి ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదు. ఈ బుక్ అందరికి ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే కన్నప్ప చరిత్రని అందరికి తెలియచేయాలి’ అని తెలియజేశారు మంచు విష్ణు.

 

ఇక ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరింకెందుకు ఆలస్యం మీకు కూడా కన్నప్ప బుక్ ఫ్రీగా కావాలి అంతే మంచు విష్ణు ఇంస్టాగ్రామ్ కి ఒక మెసేజ్ పెట్టేయండి

Also read: Lok Sabha Elections 2024: దేశంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు..

Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News