Rinku Singh Hits big Six In Mitchell Starc Bowling: దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మెుదలైంది. ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో జట్లన్నీ ప్రాక్టీషును ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే.. కోల్‌కతా జట్టు వార్మప్ మ్యాచులు ఆడుతోంది. అయితే కేకేఆర్ జట్టు.. టీమ్ గోల్డ్, టీమ్ పర్పుల్ గా విడిపోయి ప్రాక్టీస్ చేశాయి. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో వార్మప్ మ్యాచులో పర్పుల్ కు స్టార్క్ సారథ్యం వహించాడు. టీమ్ గోల్డ్ తరపున బరిలోకి దిగిన రింకూ సింగ్ అతడికి పట్టపగలే చుక్కలు చూపించాడు. అప్పటి వరకు ఇబ్బందిపెట్టిన స్టార్క్ ను.. చివరి ఓవర్లో మాత్రం ఉతికారేశాడు. ముఖ్యంగా అతడు వేసిన ఓ పుల్ టాస్ బంతిని రింకూ కళ్లు చెదిరే రీతిలో సిక్స్ గా మలిచాడు. దీంతో స్టార్క్ కూడా షాక్ అయ్యాడు. ప్రస్సుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచులో రింకూ 16 బంతుల్లోనే 37 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు నాలుగు ఓవర్లు వేసిన స్టార్క్ ఏకంగా 40 పరగులు సమర్పించుకున్నాడు. అయితే ఒక వికెట్ మాత్రం తీయగలిగాడు. ఈ సీజన్ లో స్టార్క్ ను 24.75 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది కేకేఆర్. రింకూ ధర కేవలం రూ. 55 లక్షలు మాత్రమే. కేకేఆర్ టీమ్ మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.
Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥
This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR
— कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024
Also Read: Virat Kohli: 'నన్ను అలా పిలవకండి'... ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన కోహ్లీ..
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11:
ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి
కేకేఆర్ టీమ్:
నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సుయేష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, జాసన్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ చరోరతి, వైభవ్ చరోరతి భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, సాకిబ్ హుస్సేన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook