Delhi CM: అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు? రేసులో భార్యతో సహా ముగ్గురు

Who Is Next Delhi Chief Minister: ఎట్టకేలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో మద్యం కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగి. అరెస్ట్‌తో సీఎం పదవిని కేజ్రీవాల్‌ వదులుకోవాల్సి ఉండడంతో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌ భార్యతోపాటు....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 21, 2024, 10:57 PM IST
Delhi CM: అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు? రేసులో భార్యతో సహా ముగ్గురు

Delhi Next CM: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కావడంతో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసినట్లుగానే ఢిల్లీ పరిణామాలు వేగంగా మారాయి. సెర్చ్‌ వారంట్‌తో కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఢిల్లీలో జరిగే పరిణామాలు ఏమిటనేది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా నలుగురు ఉన్నారు. 

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టవడంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిందే. ముఖ్యమంత్రి పదవిని త్యజించాల్సిందే. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రిపై చర్చలు మొదలయ్యాయి. వాస్తవంగా కేజ్రీవాల్‌ తర్వాత అంతటి స్థాయి నాయకుడిగా మనీష్‌ సిసోడియా ఉండేవారు. కానీ ఈ కుంభకోణం కేసులోనే సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన ఉండి ఉంటే తదుపరి ముఖ్యమంత్రి ఆయనే అయ్యేవారు. సిసోడియా లేకపోవడంతో ద్వితీయ నాయకత్వానికి ఢిల్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా నలుగురు ఉన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతతోపాటు అతిషి, గోపాల్‌ రాయ్‌, రాఘవ్‌ చద్దాలో ఎవరో ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వస్తున్నాయి.

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?

 

సునీతా కేజ్రీవాల్‌
భర్త అరెస్ట్‌ కావడంతో తదుపరి ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి ఉన్నారు. విద్యావంతురాలైన సునీతా కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ పదవుల్లో, రాజకీయ బాధ్యతల్లో లేరు. కానీ ప్రాంతీయ పార్టీల్లో ఉండే వారసత్వ రాజకీయాలపరంగా చూస్తే అరవింద్‌ కేజ్రీవాల్‌ తర్వాత సునీతా సీఎం అవకాశాలు ఉన్నాయి. సామాన్యుడి పార్టీగా చెప్పుకునే ఆమ్‌ ఆద్మీ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవని భావిస్తే మాత్రం సునీత కాకుండా వేరే వ్యక్తులు సీఎం అవుతారు.

అతిషి మర్లెనా
ఆమ్‌ ఆద్మీ పార్టీలో కీలక నాయకురాలిగా అతిషి మర్లెనా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీ కోర్‌ టీమ్‌లో ముఖ్యమైన వ్యక్తి. ఢిల్లీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పాలనలోనూ.. రాజకీయంగానూ అతిషి పరిణతి సాధించడం.. ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో అతిషి ముందంజలో ఉన్నారు.

గోపాల్‌ రాయ్‌
రాజకీయాల్లోకి రాకముందు నుంచే అరవింద్‌ కేజ్రీవాల్‌తో గోపాల్‌ రాయ్‌ మంచి అనుబంధం కలిగి ఉన్నారు. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌లతో కలిసి గోపాల్‌ రాయ్‌ అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారు. మొదటి నుంచి కేజ్రీవాల్‌ వెన్నంటి ఉన్నారు. ప్రస్తుతం గోపాల్‌ రాయ్‌ ఢిల్లీ కార్మిక అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. పార్టీ వ్యవహారాలను కూడా చక్కగా చూసుకుంటున్నారు. పార్టీ ఢిల్లీ 
కన్వీనర్‌గా గోపాల్‌ రాయ్‌ కొనసాగుతుండడంతో ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రాఘవ్‌ చద్దా
యువ నాయకుడు.. విద్యావంతుడైన రాఘవ్‌ చద్దా పేరు కూడా సీఎం రేసులో ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్‌ రాజకీయంగా పాలనపరంగా విజయవంతమయ్యాడు. మొదట ఢిల్లీలో ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం కేజ్రీవాల్‌కు సలహాదారుగా వ్యవహరించాడు. యువ నాయకుడు కావడంతో ఢిల్లీ సీఎంగా రాఘవ్‌ చద్దాను నియమించే అవకాశం కూడా లేకపోలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News