Weight Loss With Coriander Seeds: మీరు కూడా బరువు తగ్గాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారా? ఈరోజుల్లో బ్యాడ్ లైఫ్ స్టైల్, కూర్చని ఎక్కువ గంటలు పనిచేయడం లేదా వేరే ఇతర అనారోగ్య సమస్యల వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితాలు రావు. కొద్దిరోజులు ప్రయత్నించి విసుగు చెంది ఆ ప్రయత్నాన్ని వదిలేస్తారు. కొంద మంది బరువు తగ్గుతారు. మరి కొన్ని రోజులకు మళ్లీ బరువు పెరుగుతారు. మీరు కూడా ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే, మీకోసం ఓ మంచి హోం రెమిడీ ఉంది. అదేంటో తెలుసుకుందాం.
బరువు పెరగడం అనేది జీవనశైలిపై కచ్చితంగా ఆధారపడుతుంది. దీనికి మన వంటింట్లోనే ఓ మందు ఉంది. అదే, ధనియాలు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని మనం సాధారణంగా కూరల్లో వాడుకుంటాం. ఇది మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ధనియాలతో సులభంగా బరువు తగ్గుతారంటే మీరు నమ్ముతారా? అవును ధనియాల నీటిని తాగితే బరువు ఈజీగా తగ్గిపోతారు. దీనికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం.
ధనియాల నీటిని తయారు చేసుకునే విధానం..
బరువు తగ్గడానికి ధనియాల నీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ధనియాలను నానబెట్టాలి. అంటే మీరు ఓ గ్లాసు నీరు తాగాలనకోండి. ఓ చెంచా ధనియాల గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. వాటిని ఉదయం మీరు బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున తాగాలి.
ఇదీ చదవండి: విటమిన్ K శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. ఏ పండ్లలో ఉంటుందో తెలుసా?
ఇలా కాకుండా ధనియాల నీటిని మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ధనియాలను కప్పు నీటిలో సుమారు ఓ 10 నిమిషాల పాటు స్టవ్ పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. ధనియాల నీటిని ఉయదం పరగడుపున ఇలా తాగడం వల్ల మన జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధనియాల నీటిని ఇలా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలివేయదు.
మనం రోజూ వంటల్లో వాడే ధనియాలను గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా స్మూథీ తయారు చేసుకుంటే ధనియాలను గ్రైండ్ చేసుకుని వాటి మీద చల్లుకుని వేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు, మనం మజ్జిగ తయారు చేసుకున్నప్పుడు కూడా అందులో కూడా ధనియాలను గ్రైండ్ చేసుకుని తాగవచ్చు.మనం ఇంట్లో రసం తయారు చేసుకున్నప్పుడు కూడా ధనియాల సువాసన ఆ రసానికి రుచిని తెస్తుంది. ఈ రసంలో మనం ధనియాలను గ్రైండ్ చేసి వేసుకుంటాం. ఇది కూడా ధనియాలను మన డైట్లో చేర్చుకునే మరో మార్గం.
ఇదీ చదవండి: హోలీరోజు భాంగ్ ఎందుకు తాగుతారు? ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసా?
కొత్తిమీర విత్తన సలాడ్ - కొత్తిమీర గింజలను ఆలివ్ నూనె, నిమ్మరసం, వెల్లుల్లి, ఉప్పు మరియు మిరియాలతో వేయండి. ఈ పొడిని మీకు ఇష్టమైన సలాడ్‌పై చల్లుకోవచ్చు. ఇది సలాడ్‌కు రుచిని ఇస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )