Tillu 2 Release Trailr Talk Review: సిద్దు జొన్నలగడ్డ పదేళ్ల నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్' మూవీతో పరిచయ్యాడు. ఆ తర్వాత 'గుంటూరు టాకీస్' మూవీలో తన యాక్టింగ్‌తో అదగొట్టాడు. మధ్యలో 'కృష్ణ అండ్ హీజ్ లీలా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2022లో ఈయన రైటర్‌గా విమల్ కృష్ణ చేసిన 'డీజే టిల్లు' మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా మంచి సక్సెస్ సాధించింది. ఇపుడీ మూవీకి సీక్వెల్‌గా 'టిల్లు స్క్కేర్' మూవీ చేసాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో మల్లిక్ రామ్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ మాస్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ట్రైలర్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో హద్దులు దాటి సిద్దుకు మూతి ముద్దులు ఇచ్చేసింది. ఈ సినిమాలో సిద్దు, అనుపమ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం పక్కా అని చెబుతున్నారు. ఈ ట్రైలర్లో రొమాన్స్‌తో పాటు కామెడీ ప్లస్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ కుమ్మడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటికే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీటై పిల్లలకు సెలవులు కూడా రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు.
Fasten your seatbelts for a WILD RIDE of ACTION, FUN, and ENTERTAINMENT! 💥😎
Here’s the Release Trailer of #TilluSquare - https://t.co/49hH0h4CdB
WW Grand release at cinemas near you on March 29th! ❤️🔥#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani…
— Naga Vamsi (@vamsi84) March 27, 2024
ఈ సినిమాకు సిద్దు దాదాపు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. టిల్లు స్క్వేర్ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. సిద్దు నటించిన డీజే టిల్లు విషయానికొస్తే.. ఈ సినిమాలో తన యాక్టింగ్, మేనరిజమ్స్‌తో తెగ ఆకట్టుకున్నాడు. మరి టిల్లు స్క్వేర్తో సిద్దు ఆ మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ తప్పదా?
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook