BJP MLA Alleti Maheshwar Reddy Comments On CM Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం వలసలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కు సొంతపార్టీ నేతలు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం సీటు కోసం పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతుల కబ్జా కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. దీంతో సీఎం పైన గంభీరంగా ఉన్నప్పటి కూడా రాత్రిళ్లు నిద్రపోవట్లేదని ఎమ్మెల్యే అన్నారు. పొరపాటున ఓటుకు నోటు కేసు, లేదా మరేదైన జరిగితే.. కాంగ్రెస్ నేతల మధ్య ఒకరిపై మరోకరికి అస్సలు నమ్మకంలేదని ఎద్దేవా చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దిన దిన గండం.. అన్నట్లూ గడుపుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
రాత్రిటైంలో రేవంత్ కు నిద్రపట్టడం లేదు#AletiMahenderReddy #cmrevanthreddy pic.twitter.com/sTNAGBNFGt
— Zee Telugu News (@ZeeTeluguLive) March 30, 2024
ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మరో దుమారం రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు తెలంగాణాలో పదేళ్లపాటు, అధికారం,హోదా అనుభవించి తీరా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆపార్టీలోకి క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వంద రోజులు కాంగ్రెస్ పాలన తర్వాత, నిజమైన కాంగ్రెస్ పొలిటిషయన్స్ గా పావులు కదుపుతానంటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ నాయకులు వరదగా వచ్చి చేరుతారన్నారు.
ఆయన అన్నవిధంగానే.. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్ లు, కార్పోరేటర్ లు అందరు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. తాజాగా, బీఆర్ఎస్ సీనియర్ నేతలు.. కడియం శ్రీహారి, కే కేశవరావులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత.. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తమపార్టీలోకి రావడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారని, 8 మంది రెడీ గాఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపైకౌంటర్ గా బీజేపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం చేయోద్దని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook