Luckiest April Zodiac Sign: ఏప్రిల్ నెల బెస్ట్‌ 4 లక్కీ రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Luckiest Zodiac Sign In April 2024: జ్యోతిష్యం ప్రకారం ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఊహించని డబ్బును కూడా పొందుతారు. ఈ సమయంలో జరిగే గ్రహసంచారాల ప్రభావం కారణంగా ఈ క్రింది రాశుల వారు ఎలాంటి విజయాలైన సులభంగా సాధిస్తారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 1, 2024, 10:20 AM IST
Luckiest April Zodiac Sign: ఏప్రిల్ నెల బెస్ట్‌ 4 లక్కీ రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Lucky Zodiac Signs April 2024 In Telugu: ఏప్రిల్ నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఈ నెలలోనే శుక్రుడు బుధుడు కుజుడు రాహువు గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పడబోతోంది. అలాగే మేషరాశిలో బుధుడు శుక్రుడు కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది జాతకంలో ఈ యోగం ప్రత్యేకమైన శుభ స్థానంలో ఉంటే డబ్బుకు ధైర్యానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఏప్రిల్ నెలలో బుధుడు సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఇదే సమయంలో సూర్య గ్రహణం కూడా రాబోతోంది. దీంతో ఈనెల మరింత ప్రత్యేకంగా మారుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒకే సమయంలో ప్రత్యేక యోగాలు ఏర్పడడం సూర్యగ్రహణం రావడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశిలో వారికి ఎలా ఉంటుందో? ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎక్కువ లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.

వృషభ రాశి:
ఏప్రిల్ నెల గ్రహ సంచారాలు కారణంగా వృషభ రాశి వారికి కెరీర్, వ్యాపార సంబంధ విషయాల్లో అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొంతమందికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. దీనికి కారణం ఊహించలేనంత డబ్బును పొందుతారు అలాగే పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది.

సింహరాశి:
సింహరాశి వారికి ఏప్రిల్ నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అదృష్టం పెరగడంతో పాటు సమస్యల నుంచి లభిస్తుంది. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఇక కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అయితే వీరు వివాదాస్పద విషయాల్లో దూరకుండా ఉండడం ఎంతో మంచిది. ఈ సమయం నిర్ణయాలు తీసుకునేందుకు చాలా బాగుంటుంది కాబట్టి గొప్ప నిర్ణయాలు తీసుకొని చాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి:
ముఖ్యంగా ఏప్రిల్ నెల తులా రాశి వారికి ఎంతో కీలకమైంది. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగుల మద్దతు లభించి ప్రమోషన్స్ కూడా పొందుతారు. దీంతోపాటు ఇంతకు ముందు నుంచి వస్తున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వృశ్చికరాశి:
వృచ్చిక రాశి వారికి కూడా ఏప్రిల్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అయితే ఈ నెలలోని మూడవ వారం చాలెంజిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కాస్త ఖర్చులు పెరగడం బడ్జెట్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే పనుల్లో కూడా చిన్నచిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News