Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..

Ram Charan Doctorate: రామ్ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 07:19 AM IST
Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..

Ram Charan Doctorate: రామ్ చరణ్‌ .. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటి వరకు 14 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించారు. ఇన్ని తక్కువ చిత్రాలతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన హీరో ఎవరు లేరనే చెప్పాలి. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు సలాం కొట్టారు. సినిమా సినిమాకు తన ఇమేజ్‌ను పెంచుకుంటూ పోతున్న రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ చరణ్‌ను గౌర‌వ డాక్ట‌రేట్‌తో సత్కరించింది. అంతేకాదు దానికి సంబంధించిన డాక్టరేట్ పత్రాలను అందజేసింది.
వివిధ రంగాల్లో ప్రముఖ వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ఎపుడు ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందించడం విశేషం. అందులో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించారు.

డాక్టరేట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ..
సినిమాల్లో నా నటనకు గుర్తించి ‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌర‌వంతో డాక్ట‌రేట్ బ‌హుక‌రించిన వేల్స్ యూనివ‌ర్సిటీ వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నట్టు తెలిపారు. 45వేల‌కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్స‌రాల‌కు పైగా ఈ యూనివ‌ర్సిటీని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. అలాంటి యూనివ‌ర్సిటీ నుంచి  నాకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇస్తున్నార‌నే విష‌యం తెలియ‌గానే మా అమ్మ‌గారు న‌మ్మ‌లేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేష‌న్స్ మ‌ధ్య‌లో నేను ఈరోజు ఇలా ఉండ‌టం ఊహిస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందన్నారు. నిజానికి నాకు ద‌క్కిన గౌర‌వం నాది కాదు.. నా అభిమానుల‌ది, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, నా తోటి న‌టీన‌టుల‌ది. వేల్స్ యూనివ‌ర్సిటీని ఇంత విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజ‌మాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను.

చెన్నై నగరంలోనే నేను పుట్టాను. ఈ ప్రదేశం నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్న‌చిరంజీవి త‌న ప్ర‌యాణాన్ని ఇక్క‌డ నుంచే మొదలుపెట్టారు. నా సతీమ‌ణి ఉపాస‌న వాళ్లు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌డ నుంచే స్టార్ట్ చేశారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన‌బై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాల‌ని క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది తప్పక నేర‌వేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్ప‌త‌నం. అన్ని రంగాల వారికి ఈ భూమి క‌ల‌ల‌ను నేరవేర్చేదిగా ఉంటూ వ‌స్తుంది. నేను ఇక్క‌డ విజ‌య హాస్పిట‌ల్‌లోనే పుట్టి పెరిగిన విషయాన్ని రామ్ చరణ్ ప్రస్తావించారు.

రామ చరణ్‌ తనసినిమాల గురించి ప్రస్తావిస్తూ.. తమిళ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారితో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాడు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది హీరోల డ్రీమ్. ఆయనతో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. శంక‌ర్‌గారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డిఫ‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే అపడేట్ ఇచ్చారు.

 

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News