Garlic for Weight Loss: ఈరోజుల్లో డెస్క్ జాబ్స్ ఎక్కువ సమయం ఉండటం, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది శారీరకంగా, మానసికంగా ప్రభావం పడుతుంది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి మంచి చిట్కా ఉంది. ఇది మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. అదే వెల్లుల్లి. బరువు తగ్గడానికి ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే, వెల్లుల్లిని మన డైట్లో ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం.
గార్లిక్ అవకాడో టోస్ట్..
వెల్లుల్లిని మీ డైట్లో చేర్చుకోవాలంటే గార్లిక్ అవకాడో టోస్ట్ తయారు చేసుకోండి. ఇది రుచికరంగా ఉంటుంది. ఈ రిసిపీ తయారు చేసుకోవడానికి హోల్ గ్రెయిన్ టోస్ట్ అవకాడో, వెల్లుల్లిని గ్రేట్ చేసి వేసుకోవాలి. క్రీమ్ లా ఉండే అవకాడో, గార్లిక్‌తో కలిపి తీసుకుంటే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.
గార్లిక్ గ్రీన్ టీ..
సాధారణంగా మనం గ్రీన్ టీ తీసుకుంటాం. దీంతో బరువు తగ్గుతారనే నమ్మకం ఉంటుంది. అయితే, ఈ గ్రీన్ టీకి వెల్లుల్లి కలిపి తీసుకోండి. వేడి నీళ్లలో వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి గ్రీన్ టీ మాదిరి తయారు చేసుకోండి. ఇందులో మీకు కావాలంటే కాస్త తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. దీంతో ఇది మరింత రుచిగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..
లెమన్ గార్లిక్ వాటర్..
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే రోజూ ఓ గ్లాసు లెమన్ గార్లిక్ వాటర్ తీసుకోండి. దీనికి ఓ అరచెక్క నిమ్మరసం గ్లాసు నీటిలో పిండి ఇందులో పచ్చి వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేడినీళ్లలో వేసుకోవాలి. ఇది మెటబాలిజం మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
గార్లిక్ యోగర్ట్ డిప్..
మీ డైట్లో గార్లిక్ చేర్చుకోవాలంటే గార్లిక్ యోగర్ట్ డిప్ తయారు చేసుకోండి. దీంతో కూడా బరువు తగ్గుతారు. పెరుగులో గ్రేట్ చేసిన వెల్లుల్లి వేసుకుని అన్నం లేదా చపాతీల్లో కలుపుకొని తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ 8 పండ్లు తింటూ బరువు ఫాస్ట్ గా తగ్గొచ్చని మీకు తెలుసా?
గార్లిక్ స్మూథీ..
పచ్చి వెల్లుల్లిని బరువు తగ్గడానికి మంచి రెమిడీగా తీసుకోవచ్చు. బెర్రీ, బనానా, పాలకూరలో కలిపి గార్లిక్ స్మూథీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజం రేటును మెరుగు చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook