Benefits Of Sesame Oil: నువ్వుల నూనె ఎంతో ప్రత్యేక స్థానం పొందిన నూనె. దీనిని ఎక్కువగా దీపారాధన కోపం వినియోగిస్తుంటారు. ఈ పూర్వ కాలంలో నువుల నూనెను ఎక్కువగా బాలింతలకు, రుతుక్రమం సమయంలో మహిళలకు ఇచ్చేవారని తెలుస్తుంది. నువ్వుల నూనె తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా చర్మం సమస్యలు, జుట్టు సమస్యలకు ఈ నూనె ఎంతో ఉపయోగపడుతుంది. నువుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఇ, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా ఆయుర్వేద నిపుణులు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ నువుల నూనె వల్ల కలిగే మరి కొన్ని ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
నువ్వుల నూనె అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
నువ్వులలో బోలెడు పోషకాలు ఉన్నాయి. ఆరోగ్య లాభాలతో పాటు చర్మ సమస్యలు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిని పచ్చిగా లేదా వేయించి , నూనెను ఆహారపదార్థాలలో ఉపయోగించవచ్చు. దీనిలోకి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ గుణాలు ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతాయి. కీళ్ల సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఫలితాలను అందిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని ఒమేగా-3 చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో మేలు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.
అధిక రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడేవారికి నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నువ్వుల నూనె తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కొంట్రోల్‌లో ఉంటుంది. క్యాన్సర్‌తో పొరాడటానికి నువ్వులు ఎంతో సహాయపడుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటాకి సహాయపడుతాయి.
శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల హాని నుంచి రక్షించడంలో నువ్వులు సహాయపడుతుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో నువులు మేలు చేస్తాయి, ఇందులోని ఫైబర్ మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో మేలు చేస్తుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. ఇది చర్మంను మృదువుగా తయారు చేస్తుంది. దీని వల్ల చర్మం ఎల్లప్పుడు హైడ్రేట్‌గా ఉంటుంది. జుట్టు పెరుగుదలలో కూడా నువ్వులు ఎంతో మేలు చేస్తాయి.
ఈ విధంగా నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా నువ్వలతో తయారు చేసిన ఆహారపదర్థాలను తీసుకోవడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి