Shukra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి. ఈ గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ శుక్ర గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు, అశుభ స్థానంలో ఉన్నవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి. లగ్జరీ, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామానికి సూచికగా భావించే ఈ శుక్ర గ్రహం ఏప్రిల్ 28న మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మేష రాశితో పాటు మరో 3 రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఈ శుక్ర గ్రహం సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశువారికి లాభాలే లాభాలు:
మేష రాశి:
మేష రాశి శుక్రుని సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ఉత్సాహం పెరుగుతుంది. అలాగే సీనియర్ల నుంచి ప్రశసంలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా విస్తరించే ఛాన్స్ కూడా ఉంది.
మిథున రాశి:
మిథున రాశివారికి ఈ శుక్రగ్రహం సంచారం చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇతరు మీకు సపోర్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పెద్దల పట్ల గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కూడా సులభంగా పెరుగుతాయి. అంతేకాకుండా తండ్రి సపోర్ట్ లభించి కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త అవకాశాలను కూడా పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కూడా సులభంగా జరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహ రాశి:
శుక్రుడి సంచారం సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నవారికి ఈ సమయంలో కాసుల వర్షం కురుస్తుంది. దీంతో పాటు శని దేవుడి అనుగ్రహం లభించే ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఎలాంటి పనులైన సకాలంలో చేయగలుగుతారు.
కన్యా రాశి:
శుక్రుడి సంచారం కన్యా రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా కొన్ని వీరు వ్యాపారాల్లో విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి