Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు.. ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు..

Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2024, 07:48 PM IST
  • మందుబాబులకు ఊహించని ట్విస్ట్..
  • హనుమాన్ జయంతి సందర్బంగా లిక్కర్ షాపుల్ క్లోజ్..
 Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు.. ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు..

Hyderabad CP Kothakota Srinivas Reddy Orders Liquor Shops Close On Hanuman Jayanthi: దేశంలో ఒక వైపు ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు వరుసగా పండుగల నేపథ్యంలో పోలీసులు పగలనక రాత్రనక డ్యూటీలలో బిజీగా ఉంటున్నారు.  ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పహారా కాస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. దీంతో నిరంతరం తనిఖీలు, ప్రత్యేకంగా నిఘా చేస్తుంటారు. మరోవైపు రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారు. పోలీసులు కూడా ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించిన కూడా అక్కడ బందోబస్తు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో ఎక్కడైన ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారా.. అన్న విషయాలపై కూడా నిరంతరంనిఘా ఉంచుతుంటారు.

Read More: Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా..

ఇక ఎన్నికలకు ముందు చాలా చోట్ల డబ్బుల పంపిణీ, రహస్యంగా చీరలు, ఇతర ఫర్నీచర్లు, గిఫ్ట్ లను కొందరు నేతలు ఓటర్లకు పంచిపెడుతుంటారు. ఉచితంగా మద్యం, బిర్యానీ పంపిణీలు కూడా చేస్తుంటారు. వీటిపై కూడా పోలీసులు నిరంతరం నిఘా పెడుతూఉంటారు. పోలీసులు కేసులను కూడా నమోదు చేస్తుంటారు. ఎన్నిలక నియమావళి కన్న ఎక్కువగా ఎవరైన డబ్బులను తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిస్తే వాటినిస్వాధీనం చేసుకుంటారు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లలోపోలసులు గస్తీ కాస్తుంటారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వరుసగా పండగలు వస్తున్నాయి. ఇప్పటికే ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వేడుకలలో పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈనెల 23 న హనుమాన్ జయంతివేడుకలు జరగనున్నాయి. హనుమాన్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల హనుమాన్ విజయయాత్రలు చేపడుతుంటారు. కొన్నిసార్లుఈ యాత్రలలో అవాంఛనీయ సంఘటనలు కూడా గతంలో జరిగాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా హనుమాన్ యాత్రలు ఎక్కడైతే నిర్వహిస్తారో ఆ దారిపొడవుగా బందోబస్తు నిర్వహిస్తారు.

Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..

అంతేకాకుండా.. వేడుకల సమయంలో లిక్కర్ షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశిస్తుంటారు. దీనిలో భాగంగా.. ఎల్లుండి అంటే.. మంగళవారం ఈనెల 23 న ఉదయం 6 నుంచి 24 ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైన్స్, లిక్కర్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ ఉత్సవాలను పవిత్రంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News