IPL 2024-Virat Kohli: ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది కేకేఆర్. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ అంపైర్ తో గొడవపడ్డాడు. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం ఫైన్ వేసింది బీసీసీఐ. అసలు విరాట్ అంపైర్ తో ఎందుకు గొడవకు దిగాడు? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రానా(Harshit Rana) బౌలింగ్‌లో కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. అయితే హర్షిత్ వేసిన హై ఫుల్‌టాస్ బంతిని నో బాల్ ఇవ్వకపోవడంతో కోహ్లీ అంపైర్‌తో గొడవకు దిగాడు. ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాల్సిదని విరాట్ అంపైర్ తో వాదనకు దిగాడు. అంపైర్ వినకపోవడంతో అతడు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ డస్ట్‌బిన్‌ను బ్యాటుతో కొట్టాడు. ఈ మెుత్తం ఎపిసోడ్ ను మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణిస్తూ పై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. అంతేకాదు కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియామాళి కింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు అధికారులు.
Also Read: IPL 2024 Playoff Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి ఆ రెండు జట్లు ఔట్..!
📽️ WATCH: A jaw-dropping finish!
The final delivery that sealed the win for the @KKRiders 👏👏
Scorecard ▶️ https://t.co/hB6cFsk9TT#TATAIPL | #KKRvRCB pic.twitter.com/BR5RYrOeDM
— IndianPremierLeague (@IPL) April 21, 2024
భయపెట్టిన కరణ్ శర్మ
ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(48), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(50) అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేజింగ్ ను ప్రారంభించిన ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే చివరి ఓవర్ లో హైడ్రామా నడిచింది. కరణ్ శర్మ మూడు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించేంత పనిచేశాడు. కానీ కరణ్ ను ఔట్ చేసి ఆర్సీబీకి షాకిచ్చాడు స్టార్క్. దీంతో ఒక్క రన్ తేడాతో బెంగళూరు పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
Also Read: Virat Kohli No Ball Issue: విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం, ముదురుతున్న నో బాల్ వివాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook