న్యూఢిల్లీ: టీమిండియా మహిళల జట్టుకు ప్రధాన కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ ఓ అడ్‌హక్ కమిటీని ఏర్పాటుచేసింది. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ అడ్‌హక్ కమిటీ టీమిండియా మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అన్షుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ఉంటారు.