Break Fast : బిజీబిజీ జీవితాల్లో పడి సమయానికి తిండి తినడం కొందరు మానేస్తుంటారు. కానీ మనం ఏం తింటున్నాం.. అనే విషయంతో పాటు ఎప్పుడు తింటున్నాం.. అనేది కూడా మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా అవసరం. మిగతా మీల్స్ కంటే ఉదయాన్నే చేసే బ్రేక్ ఫాస్ట్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కనీసం 6 నుంచి 8 గంటల వ్యవధి తరువాత మనం తీసుకుంటున్న మొదటి ఆహారం కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువ పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి.
మాంసంతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. ఎక్కువగా తినడం తగ్గించవచ్చు. దాని వల్ల బరువుని కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మన బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేసి చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి బ్రేక్ ఫాస్ట్ అత్యంత అవసరం. అలానే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. అది జీర్ణక్రియకు బాగా దోహదపడుతుంది అంతేకాకుండా ఆకలి కూడా తగ్గిస్తుంది. పొట్టలోని మలినాలను తొలగించడానికి కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది.ఎముకలు ప్రోటీన్స్ తోనే బలపడతాయి. అందుకే ప్రోటీన్, క్యాల్షియం ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రోటీన్ తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా బ్రేక్ ఫాస్ట్ లో ఉండేలా చూసుకోవాలి. దానివల్ల శరీర ఉత్పాదకత పెరుగుతుంది. ముఖ్యంగా కణాలను మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి కావాల్సిన పౌష్టికమైన బ్రేక్ ఫాస్ట్ శరీరానికి ఎంతో అవసరం. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. శరీరానికి కావాల్సినంత శక్తిని అందించడానికి, సమర్ధవంతంగా శక్తిని ఉపయోగించడానికి అది సహాయపడుతుంది.
మన శరీరానికి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా ముఖ్యం. అది ఉత్పత్తి అవ్వాలన్నా కూడా మంచి ఆహారం తీసుకోవాలి. అది కూడా ముఖ్యంగా మనం ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే పౌష్టిక ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఏ, సి, ఇ లతో పాటు కాపర్, జింక్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఇలా మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే మాత్రం పైన చెప్పినవన్నీ మిస్ అవ్వడమే కాకుండా.. ఆరోగ్యం పైన కూడా దెబ్బ పడుతుందని ఎన్నో సర్వేలు తెలియజేసాయి. కాబట్టి ఏ సమయంలో తిన్న, తినకపోయినా.. బ్రేక్ ఫాస్ట్ మాత్రం.. ఆరోగ్యంగా, కడుపు నిండుగా తినడం మంచిది.
Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్ కట్.. ఉద్యోగి పోస్టు ఊస్ట్
Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter