IPL 2024 Final KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్ 17 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ పోరు నేడే, రెండు జట్ల బలబలాలు, పిచ్ రిపోర్ట్

IPL 2024 Final KKR vs SRH: దాదాపు రెండు నెలల సమరానికి ఇవాళ తెరపడనుంది. అనూహ్యమైన సంచలనాలు, రికార్డులు నెలకొల్పిన ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది సమరం ఇవాళ జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం సాక్షిగా టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2024, 08:07 AM IST
IPL 2024 Final KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్ 17 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ పోరు నేడే, రెండు జట్ల బలబలాలు, పిచ్ రిపోర్ట్

IPL 2024 Final KKR vs SRH: గత 2-3 సీజన్లలో విఫలమైన జట్లు ఈసారి అనూహ్యంగా ఫైనల్‌లో తలపడుతున్నాయి. 8-10 ఏళ్ల తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ముందే ఇంటికి చేరితే, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్‌కు ముందు నిష్క్రమించింది. ఈసారైనా కప్ గెలుద్దామనుకున్న ఆర్సీబీ ఆశలు ప్లే ఆఫ్‌లో నీరుగారిపోయాయి.

రెండు నెలల్నించి ఉత్కంఠ భరితంగా సంచలనాలు నమోదు చేస్తూ సాగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది సమరం ఇవాళ చెన్నై చెపాక్ స్డేడియం సాక్షిగా ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరగనుంది. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్‌పై ఎస్ఆర్‌హెచ్ ప్రతీకారం తీర్చుకుని టైటిల్ గెలుస్తుందో లేదో అనేది ఆసక్తిగా మారింది. అటు లీగ్ దశలో ఇటు క్వాలిఫయర్ రౌండ్ రెండింట్లోనూ కేకేఆర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడటం ఆ జట్టుకు కాస్త ఆందోళన కల్గించవచ్చు. కానీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగితే ఇక ఢోకా ఉండకపోవచ్చు. ఏ బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందనుకుందో అదే బౌలింగ్‌తో ఎలిమినేటర్ 2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించడం జట్టుకు కలిసొచ్చే అంశం. జట్టులో ఎయిడెన్ మార్క్‌రమ్ స్థానంలో కివీ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ చేరవచ్చు. ప్రారంభ మ్యాచ్‌లలో అదరగొట్టిన నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్‌లు రాణించాల్సి ఉంది. 

శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశాలున్నాయి. సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్‌లు బ్యాటింగ్ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుస్తుంటే స్టార్క్, హర్షిత్, రాణా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆధిక్యం కనబర్చి పదేళ్ల తరువాత టైటిల్ ముద్దాడేందుకు కేకేఆర్ పట్టుదలతో ఉంది. 

పిచ్, వాతావరణం ఎలా ఉంది

చెన్నై చెపాక్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌కు వర్షం అడ్జంకి దాదాపుగా లేదు. కేవలం చిరు జల్లులకు అవకాశముంది. వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డే ఉండనే ఉంది. ఇక పిచ్ అయితే స్పిన్‌కు అనుకూలించవచ్చు. ఫైనల్ కోసం మరో పిచ్ సిద్ధమైంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోర్ టార్గెట్ ఇచ్చేందుకు రెండు జట్లూ ప్రయత్నించవచ్చు. 

రెండు జట్ల బలాబలాలు

ఈ సీజన్‌లో రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. మొదటిసారి ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండవది అహ్మదాబాద్ వేదికగా జరిగాయి. రెండింట్లోనూ ఎస్ఆర్‌హెచ్ ఓడినా మొదటి మ్యాచ్ ఛేజింగ్ మాత్రం కేవలం 4 పరుగుల తేడాతో పోగొట్టుకుంది 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్ లేదా ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్, అబ్దుల్ సమద్ ( ఇంపాక్ట ప్లేయర్ కావచ్చు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయింగ్ 11 అంచనా

శ్రేయస్ అయ్యర్, సునీల్ నరైన్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్, రింకూ సింగ్, రసెల్, రమణదీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ( వీరిలో ఒకరు ఇంపాక్ట్ కావచ్చు)

Also read: Chennai Super Kings: మెగా వేలానికి ముందు ఈ ఆటగాళ్లకు చెన్నై సూపర్ కింగ్స్ టాటా.. ఎందుకంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News