రైల్వే శాఖలో భారీ రిక్రూట్‌మెంట్ ; 2.5 లక్షల ఉద్యోగాల భర్తీకి కసరత్తు

నిరుద్యోగ యువతకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

Last Updated : Jan 24, 2019, 08:56 PM IST
రైల్వే శాఖలో భారీ రిక్రూట్‌మెంట్ ; 2.5 లక్షల ఉద్యోగాల భర్తీకి కసరత్తు

నిరుద్యోగ యువత త్వరలో తీపికబురు వింటారు. రైల్వేశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల 50 వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.  కసరత్తు పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఉద్యోగాల భర్తీపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలోని సుమారు 2.50 లక్షల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు  ప్రకటించారు.

 యూత్ బ్యాంక్ రాజకీయాలు

ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్లు కేటాయించి అగ్రవర్ణాల మెప్పుపొందిన మోడీ సర్కార్..చిరు వ్యాపారులపై జీఎస్టీ రాయితీ లాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎన్నికల నాటికి యువతను మోడీ సర్కార్ తనవైపు తిప్పుకునందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకేనా ?

ఎన్నికల సమీపిస్తున్న తరణంలో నిరుద్యోగ సమయస్య గళం ఎత్తి బీజేపీ సర్కార్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రధాని మోడీ మోసం చేశారని విరమ్శలు సంధిస్తున్నాయి. ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగ యువత వ్యతిరేకత నుంచి బయటపడేందుకు మోడీ సర్కార్ ఈ మేరకు రిక్రూట్ మెంట్ కు సన్నాహాలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Trending News