Hair Fall: జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా.. ఈ ఆహారం కచ్చితంగా తినాల్సిందే..

Hair Fall Remedies: సరిగ్గా తినకపోవడం, బయట పెరిగిపోతున్న కాలుష్యం.. ఇలా చాలా కారణాల వల్ల.. జుట్టు ఎక్కువగా ఉడిపోతూ ఉంటుంది. కానీ మనం తినే ఆహారంలో కొన్ని మార్పుల వల్ల.. జుట్టు ఊడటం ఆగిపోయి కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 13, 2024, 10:22 AM IST
Hair Fall: జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా.. ఈ ఆహారం కచ్చితంగా తినాల్సిందే..

Foods for Hair Fall: పెరిగిపోతున్న కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, జన్యు పరమైన కారణాల వల్ల  జుట్టు రాలిపోతూ ఉంటుంది. మన జుట్టును కాపాడుకోవడం కోసం.. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం.. అనేది కూడా చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

డ్రై ఫ్రూట్స్:

బాదం, వాల్‌ నట్స్, జీడిపప్పు, అంజీర, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు.. విత్తనాలను వంటివి ఉదయాన్నే తీసుకోవడం.. మన గుండెకి మాత్రమే కాదు.. జుట్టు కి కూడా అవసరం. వాటిల్లో ఉండే విటమిన్ ఇ.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వాల్ నట్స్ లో ఉండే కాపర్.. జుట్టు సహజ రంగును కాపాడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. ముఖ్యంగా బచ్చలికూర, పార్స్లీ వంటి ఆకు కూరల్లో.. ఉండే ఐరన్ జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలను.. దూరం చేస్తుంది.

క్యారెట్:

క్యారెట్ తినడం వల్ల కంటి ఆరోగ్యం మాత్రమే కాదు.. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. క్యారెట్ లో ఉండే.. బీటా కెరోటిన్.. జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ.. మన శరీరంలో తగ్గితే.. జుట్టు రాలడం, పల్చగా అవ్వడం, బట్టతల రావడం వంటివి జరుగుతాయి. 

కోడిగుడ్లు:

గుడ్లలో మన శరీరానికి బాగా కావాల్సిన జింక్, సల్ఫర్, ఐరన్, సెలీనియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. అవి జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. వాటిల్లో ఉండే బయోటిన్, విటమిన్ బి7 వంటివి కూడా జుట్టు ఊడిపోకుండా.. దృఢంగా ఉండేందుకు దోహద పడతాయి.

బెర్రీలు:

మన జుట్టు ఓడిపోవడానికి గల ముఖ్య కారణాల్లో విటమిన్ సి డెఫిషియన్సీ కూడా ఒకటి. ఆ విటమిన్ సీ.. పుష్కలంగా బెర్రీ పండ్లలో కూడా లభిస్తుంది. రోజు బెర్రీ పండ్లు తినడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

తాజా కూరగాయలు: 

మనం తినే ఆహారంలో బీన్స్, పప్పులు వంటివి జోడించడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బీన్స్, పప్పులలో బయోటిన్ తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. శాఖాహారం ఆహారంలో బీన్స్, పప్పు లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

ఎండుద్రాక్ష:

ఎండుద్రాక్షలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మన జుట్టుకి కావాల్సిన అన్ని పోషకాలను.. అందిస్తుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల.. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు ఊడటం కూడా తగ్గి దృఢంగా పెరుగుతుంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News