Shani Dev: జ్యోతిష శాస్త్రంలో శని గ్రహా న్ని ఎంతో కఠినమైన కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే శని దేవుడు ఎలాగైతే కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. శని గ్రహం కూడా వ్యక్తుల కర్మలకు అనుగుణంగానే ప్రభావం చూపుతుంది. అందుకే ఈ శని గ్రహాన్ని న్యాయమూర్తిగా పిలుస్తారు. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని శని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కొన్ని రాశుల వారికి శని దేవుడు అప్పుడప్పుడు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని అందిస్తాడు. ముఖ్యంగా శని మహర్ద ఎదుర్కొంటున్న రాశుల వారికి కష్ట సమయాల్లో దయ చూపెడుతూ ఉంటాడు. దీనికి కారణంగా అనేక సమస్యలను కూడా విముక్తి లభిస్తుంది. అయితే ఈ శని మహర్దశ సమయంలో ఏలినాటి శని తో బాధపడుతున్న వారు కొన్ని నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే శని ప్రభావం ఏయే రాశుల వారిపై ఎక్కువగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి:
శని గ్రహానికి ఎంతో ఇష్టమైన రాశుల్లో తులా రాశి ఒకటి. అందుకే ఈ రాశి వారికి ఎల్లప్పుడూ శని దేవుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఆయన ఆఫీసులతో ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో జీవించేందుకు అన్ని సౌకర్యాలు పొందుతారు. అలాగే శని ప్రత్యేకమైన ఆశీస్సులతో పేదల పట్ల దయ చూపుతారు. అందుకే ఈ రాశి వారు ఎలాంటి పనులైనా సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలన్నీ ఎంతో తొందరగా తొలగిపోతాయి. అలాగే జీవితంలో కీర్తి ఆనందం రెట్టింపు అవుతుంది.
మకర రాశి:
మకర రాశి వారికి శని గ్రహం అధిపతిగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ రాశి వారిపై కూడా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే వీరు ఏలినాటి శని నుంచి అతి తక్కువ ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. మకర రాశి వారికి ఏలినాటి శని సమయంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని వారంటున్నారు అలాగే వీరు ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం వల్ల రాజకీయరంగంలో బాగా రాణించగలుగుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వృషభ రాశి:
శని పరిపాలించే రాశుల్లో వృషభ రాశి ఒకటి ఈ రాశి వారికి శని దేవుడు ఎల్లప్పుడూ అనుగ్రహాన్ని అందిస్తాడు. దీని కారణంగా వీరు ఎల్లప్పుడు గరిష్టమైన విజయాలను సాధించింది. ఎందుకు శక్తిని పొందుతారు అలాగే సమాజంలో వీరికి శ్రేయస్సు కీర్తి అంచలంచలుగా ఎదుగుతూ వస్తుంది. శని దేవుడి ప్రత్యేకమైన అనుగ్రహంతో ఎలాంటి పనులైనా ఎంతో చాకచక్యంగా చేసేందుకు వృషభ రాశి వారు అద్భుతమైన శక్తిని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి