Sun-Venus conjunction 2024 In Telugu: జూలై నెల జ్యోతిష్య శాస్త్రం ప్రరంగా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మాసంలో కొన్ని గ్రహాలతో పాటు నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. జూలై నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రగ్రహంతో పాటు సూర్య గ్రహం కూడా రాశి సంచారం చేయబోతున్నాయి. అలాగే ఈ రెండు గ్రహాలు చంద్రుడి రాశిలో సంయోగం చేయబోతున్నాయి. అంతేకాకుండా జూలై 07న శుక్ర గ్రహం కూడా సంచారం చేసేందుకు సిద్ధమైంది. ఈ గ్రహం కర్కాటకంలోకి సంచారం చేసింది. ఇలా ఈ నెలలో చాలా గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలు సంయోగం కారణంగా ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీంతో పలు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గ్రహాలు జాతకంలో అశుభ స్థానంలో ఉన్నవారికి దుష్ప్రభావాలు కలగొచ్చు.
కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి చంద్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఇదే రాశిలో శుక్రుడితో పాటు సూర్యుడు సంయోగం చేయడం కారణంగా కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి ధైర్యం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వీరికి విశ్వాసం పెరిగి అనుకున్న పనులు ఎంతో సులభంగా చేస్తారు. భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ధన ప్రవాహాం కూడా రెట్టింపు అవుతుంది.
కన్యారాశి:
సూర్య-శుక్రులు సంయోగం కారణంగా కన్యా రాశివారికి ఈ జూలై నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో విజయాలు సాధించే ఛాన్స్ ఉంది. అలాగే అనుకున్న పనులు కూడా ఎంతో తొందరగా చేస్తారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు వృత్తి జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తుల రాశి:
తుల రాశివారికి కూడా ఈ జూలై నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు వింటారు. అలాగే ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారు ఊహించని ప్రమెషన్స్ పొందే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఆదాయ వనరులు కూడా పెరిగి ఆర్థికంగా లాభపడే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి