Tamannaah Bhatia Chapter: పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకంలో సినీ నటి తమన్నా జీవిత చరిత్ర ఉంది. అందాలొలికిస్తూ ప్రేక్షకులను రంజింపజేసే తమన్నా జీవితం పిల్లల పాఠంగా ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె ఏమైనా గొప్ప పోరాటయోధురాలా? ఆమె జీవితం పిల్లలకు ఎలా ఆదర్శమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కర్ణాటకలో తమన్నా పాఠం రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.
కర్ణాటకలోని బెంగళూరులో హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల పుస్తకాల్లో 7వ తరగతి పిల్లల పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా భాటియా జీవితం కనిపించింది. దేశ విభజన జరిగిన అనంతరం సింధీ వర్గానికి చెందిన ప్రముఖుల గురించి చెప్పే పాఠ్యాంశం అది. అయితే సింధీ వర్గానికి చెందిన తమన్నా భాటియా, రణ్‌వీర్ సింగ్ గురించి ఆ పాఠ్యాంశంలో ప్రస్తావించారు. ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరోయిన్ ఎలా ఆదర్శప్రాయురాలు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు.
Also Read: Kalki 2898 AD: అశ్వద్ధామ ఎవరు.. మహాభారతంలో అతని పాత్ర ఏంటి?
ఈ వివాదంపై అక్కడి ప్రైవేటు పాఠశాల సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక విద్యా శాఖ కూడా స్పందించి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చేయడంపై హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల యాజమాన్యం స్పందించింది. సింధీ వర్గానికి చెందిన తమన్నా అత్యున్నత స్థాయికి చేరం.. సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడం ద్వారానే తమన్నా జీవితం పాఠ్యాంశంగా పెట్టాం. కాగా ఇదే విషయమై పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మిల్కీ బ్యూటీగా పేరుపొందిన తమన్నా ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఈ వివాదం ఇంకా తమన్నా దృష్టికి వెళ్లనట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి