Supreme court disposes plea of seeking menstrual leave for woman employees: మహిళలు నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు రక్తం బ్లీడింగ్ సమస్యతో, పొత్తికడుపులో నొప్పితో నరకం అనుభవిస్తుంటారు. కనీసం ఒక చోటు నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు. శరీరంలో కలిగే హర్మోనల్ మార్పుల వల్ల ఎంతో చిరాకుగా ఉంటారు. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా కూడా టార్చర్ అనుభవిస్తారు. ఇదిలా ఉండగా.. చాలా కంపెనీలు మహిళలకు పీరియడ్స్ సమయంలో లీవ్స్ ఇస్తుంటారు. మన దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులను అమలు చేస్తున్నాయి.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
బీహార్ రాష్ట్రం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రెండు రోజుల నెలసరి సెలవులను ఇస్తోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా పాఠశాల, కళాశాల విద్యార్థినులకు మూడు రోజుల సెలవులు ప్రకటించింది. ఈ విధానాన్ని దేశమంతా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కొందరు సుప్రీం కోర్టులో పిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
ఈ నేపథ్యంలో ధర్మాసనం మాట్లాడుతూ.. మహిళలకు సెలవులు ఇవ్వడం వల్ల వారు తమ ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇది విధానపర నిర్ణయమని, దీనిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా నెలసరి సెలవులపై నిర్ణయం తీసుకొవాలని, పిటిషన్ దాఖలు చేయగా.. దీన్నివిచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. తాజాగా, ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేసింది.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
దీనిపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు వెళ్లాలని సూచించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన విధాన నిర్ణయమని చెప్పింది. మహిళల కోసం తెచ్చిన విధానాలు అనుకోకుండా వారికి ప్రతికూలంగా మారడం తమకు ఇష్టం లేదని వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో పిల్ ను కొట్టివేస్తు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ఇప్పుడు అనేక రాష్ట్రాలలో పీరియడ్స్ సమస్యల పట్ల ప్రభుత్వాలు జాగురతో ఉంటున్నాయి.
కొన్ని చోట్ల ప్రభుత్వాలు ప్యాడ్స్ లను సైతం ఇస్తున్నాయి. పీరియడ్స్ సమయంలో మహిళలు, అమ్మాయిలు మంచి ఫుడ్ ను తీసుకొవాలి. ఎక్కువగా బ్లడ్ పోతుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇటీవల యువత ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల వైవాహిక జీవితంలో అనేక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టడంపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకే అమ్మాయిలు, మహిళలు.. మంచి ఫుడ్ తీసుకుంటూ, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లను అవాయిడ్ చేస్తు, ఆరోగ్యం పట్ల ఎంతో అలర్ట్ గా ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి