బుల్లితెరపై ఇప్పటివరకు మనం ఎన్నో ప్రీమియర్స్ చూశాం. కానీ ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అతిపెద్ద వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్ధమైంది. భారత్ లోనే భారీ బడ్జెట్ చిత్రం 2.O… ఏప్రిల్ 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మీ జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో గ్రాఫిక్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అక్షరాలా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం విడుదలకాని రేంజ్ లో దాదాపు 14 భాషల్లో 45 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజైంది.
ఇప్పుడీ మూవీని ఎక్స్ క్లూజివ్ గా జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో చూడొచ్చు. ఏప్రిల్ 13 శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 2.O సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.