Telangana: ప్రాణాలు తీసిన దైవంగా భావించిన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ ఘటన.. ఎక్కడంటే..?

Snake bite incident: పాముకు పాలు పోసిన అది కాటు వేసే గుణం మాత్రం మార్చుకొదని పెద్దలు చెప్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక వృద్ధురాలు పామును దైవంగా భావించింది. తన ఇంట్లోనే పుట్ట ఉన్న కూడా దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయలేదు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 31, 2024, 12:42 PM IST
  • వృద్ధురాలి ప్రాణాలు తీసిన డెంజరస్ కోబ్రా..
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు..
Telangana: ప్రాణాలు తీసిన దైవంగా భావించిన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ ఘటన.. ఎక్కడంటే..?

woman died after Venomous snake bite in khanapur nirmal district: కొంత మంది క్రూర జంతువులను కూడా ఇంట్లోనే పెంచుకుంటున్నారు. పులులు, సింహాలు, పాములు, కొండ చిలువలు, పిట్ బుల్ జాతీకి చెందిన వాటిని కొంత మంది ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు నార్మల్ గా ప్రవర్తించిన కూడా, మరికొన్ని సార్లు తమ సహాజ స్వభావాన్నిమాత్రం మర్చిపోవు.  క్రూర జంతువులకు ఎంతగా మచ్చిక చేసుకుని పెంచుకున్న కూడా, కొన్నిసార్లు అవి తమ యజమానిపైకే ఎదురు తిరుగుతాయి.  అంతేకాకుండా.. చంపేందుకు కూడా వెనుకాడవు.

కొన్నిసార్లు పెంచుకున్న జంతువులు చేతిలోనే.. యజమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి.  తాజాగా ఒక వృద్ధురాలు కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణలో ఒక పుట్టలో పాము ఉన్న కూడా దాన్ని కదిలించే ప్రయత్నం చేయలేదు. ప్రతిరోజు దానికి పాలు పెట్టేదంట. పూజలు చేసేదంట. ఈ క్రమంలో ఏమైందో ఏంటో కానీ పాము పుట్టలో నుంచి బైటకు వచ్చి వృద్ధురాలిని కాటు వేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

పెద్ద వాళ్లు తరచు చెప్తుంటారు. చెడు స్వభావం ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలి. వాళ్లకు మంచి చేసిన కూడా చెడు జరుగుతుందంటారు. అలాగే క్రూర జంతువులు, విష స్వభావం గల జీవులకు దూరంగా ఉండాలి. దీని వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరు ఇటీవల పాములను పెంచుకుంటున్నారు. అడవిలో నుంచి పాముల్ని పట్టుకుని వచ్చి జీవనం సాగిస్తుంటారు. వీరు పాముల్ని ఆడించి డబ్బులు సంపాదిస్తుంటారు. కొన్నిసార్లు వీరు పాము కాటుకు గురౌతుంటారు. ఇకమరోవైపు..  పాముకు పాలు పోసి పెంచినా విషాన్నే చిమ్ముతుందని మన పెద్దలు తరచుగాచెప్తుంటారు. ప్రస్తుతం ఆమాటే నిజమైందని చెప్పుకొవచ్చు. ఒక డేంజరస్ కోబ్రా.. ఓ వృద్ధురాలి ఇంట్లో ఆవాసం ఏర్పరుచుకుంది.

ఆమె మాత్రం..  ఆ పామును దేవతగా భావించి.. ప్రతి రోజు పూజలు చేస్తూ.. భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటుంది. చుట్టుపక్కల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. కానీ ఆమె మాత్రం నాగమ్మ..తనను ఎలాంటి హనీ కల్గజేయదంటూ ధైర్యంగా ఉండేది.. ఈ నేపథ్యంలో.. ఆమె పాము కాటుకు గురైంది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఖానాపూర్‌ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన 65 ఏళ్ల అలుగుల గంగవ్వకు తనయుడు రాజలింగు, కూతురు పద్మ ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయిపోయి అత్తారింటికి వెళ్లిపోయారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసిన గంగవ్వ జులై1, 2024 రిటైరై ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది.

 ఈ క్రమంలో మంగళవారం ఉదయం గంగవ్వ తన ఇంటి మట్టి నేలను అలుకుతుండగా…  ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది. దీంతో పరుగున బయటకు వచ్చిన ఆమె.. స్థానికులకు ఘటన గురించి చెప్పింది. వారు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా… నాటువైద్యం కోసం లింగాపూర్‌కి తీసుకెళ్లారు. అక్కడివారు పరిస్థితి విషమించిందని మందు ఇచ్చేందుకు నిరాకరించారు.

Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..

దీంతో ఖానాపూర్‌ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ఆమె మృతి చెందింది. కూతురు పద్మ కంప్లైంట్  మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు కొలుచుకున్న పామే..  ప్రాణాలు తీసిందంటూ కూడా అక్కడున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News