Fight between lizard and black venomous snake video: పాముల జోలికి ఎవరు వెళ్లడానికి సాహాసం చేయరు. పాము అక్కడుంటే.. చాలా మంది ఇక్కడి నుంచి పారిపోతుంటారు. కొందరైతే పాముల పేర్లు తలవడానికి కూడా అస్సలు ఇష్టపడరు. వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు బైటపడుతుంటాయి. చాలా మంది ఈ సమయంలో పాముల కాటుకు గురౌతుంటారు. కొందరు పాములు కన్పించగానే స్నేక్ రెస్క్యూ టీమ్ లకు సమాచారం ఇస్తారు.
Monitor lizard vs black naag
[📹 sanke video]pic.twitter.com/zOFfePYuUX
— Massimo (@Rainmaker1973) July 25, 2024
అంతేకాకుండా.. పాములకు హనీ కల్గించకూడాదనిచెప్తుంటారు. కొన్నిసార్లు పాములు మాత్రంకాటు వేయగానే కొందరు భయపడిపోతుంటారు. కొందరు పాముల్ని పట్టుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తుంటారు. మరికొందరు పాముల మీద దాడులు సైతం చేస్తుంటారు. మనుషులే కాదు.. అడవిలోని జంతువులు సైతంపాములను చూసి భయపడిపోయి దూరంగా వెళ్లిపోతుంటాయి. పాములు ఉన్నచోట అస్సలు కన్పించవు. ఈ నేపథ్యంలో ఒక మానిటర్ బల్లి మాత్రం పాముకు చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
అత్యంత ప్రమాదకరమైన నల్లని పాము కాస్త మానిటర్ బల్లి కళ్లలో పడింది. సాధారణంగా మానిటర్ బల్లులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇవి అడవిలోని జింకలు, గొర్రెలు, మేకలు మొదలైన వాటిని చంపితినేస్తుంటారు. అంతేకాకుండా.. ఇవిమనుషులపైకి కూడా దాడులకు వెనుకాడవు. కొన్నిసార్లు వీటికన్న పెద్ద పరిమాణంలో ఉన్న జంతువులపైదాడులు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మానిటర్ బల్లి పాముకు చుక్కలు చూపించింది. పాము తోకను మానిటర్ బల్లి పట్టుకుంది. పామువిలవిల్లాడిపోయింది. ఎంతగా వదిలించుకుందామన్న.. సాధ్యపడలేదు.చివరకు పాము ఎన్నోసార్లు మానిటర్ బల్లికి కాటు వేసింది. అయిన కూడా దానికి చీమ కుట్టినట్లైన లేదు.
Read more: Snakes Facts: పాములు ఆడతోడు కోసం పొట్లాడుకుంటాయంట.. ఈ విషయాలు మీకు తెలుసా..?
ఈ క్రమంలో.. పాము మాత్రం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం పాము రా బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. మానిటర్ బల్లీ కూడా భలే డెంజర్ గా ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter