Health Benefits Of Ragi: రాగి పిండిలో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ పిండితో తయారుచేసిన అల్పాహారాలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మన పూర్వీకులు ఎక్కువగా అల్పాహారాలను రాగి పిండితో తయారుచేసినవే ఎక్కువగా తీసుకునే వారట అందుకే వారు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా కండరాలను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు అల్పాహారంలో రాగి పిండితో తయారుచేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా చపాతీలను తినడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా బోలెడు లాభాలు కూడా కలుగుతాయి..అవేంటో తెలుసుకోండి.
రక్తహీనతకు మందు..
రాగి పిండిలో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది. ఇది శరీరంలోని రక్తాన్ని ఉత్పత్తి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా రక్తహీనతతో బాధపడేవారు రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా రాగి పిండితో తయారు చేసిన చపాతీలను తినడం చాలా మంచిది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ ఇతర లోపం వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా రాగిపిండి చపాతీలు ఎంతగానో సహాయపడతాయి.
శరీరానికి తక్షణ శక్తి..
రాగి పిండిలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ చపాతీలు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా కండరాలు కూడా దృఢంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర బలహీనత సమస్యతో బాధపడుతున్న వారు రోజు ఉదయాన్నే తప్పకుండా రాగి పిండి రోటీలను తినాలి.
జీర్ణ క్రియ సమస్యలకు చెక్..
రాగి పిండితో తయారుచేసిన చపాతీల్లో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి తరచుగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని ఉదయాన్నే అల్పాహారంగా తినడం వల్ల సులభంగా విముక్తి పొందుతారు. అంతేకాకుండా పొట్ట కూడా ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే పూర్తిగా జీర్ణ క్రియ సమస్యలకు విముక్తి కలుగుతుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా..
బరువు తగ్గాలనుకునే వారికి రాగి పిండి చపాతి ఒక మంచి ఔషధంగా భావించవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే అల్పాహారంలో సలాడ్స్‌తో పాటు రాగి పిండి చపాతీని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో పాటు ఎక్కువగా ఆకలి వేయదు.
గుండె సమస్యల నుంచి విముక్తి..
రాగి పిండిలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ పిండితో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల రక్తపోటు వంటి సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన మొండి కొలస్ట్రాల్ కూడా కరుగుతుంది. కాబట్టి దీని కారణంగా గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బోన్ స్ట్రాంగ్..
ఎముకలు బలంగా తయారవడానికి కూడా రాగి పిండి చపాతీ కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాగి పిండితో తయారు చేసిన చపాతీల్లో అధిక మోతాదులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా ఎముకల వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఎముకల నొప్పులతో బాధపడుతున్న వృద్దులు తప్పకుండా ఉదయం అల్పాహారంలో ఈ రాగిపిండి చపాతీలను తినండి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.