Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..

Bangladesh court: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే షేక్ హాసీనా భారత్ లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 13, 2024, 04:15 PM IST
  • షేక్ హసీనాపై హత్య కేసు..
  • కేసు నమోదు చేసిన పోలీసులు...
Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..

Bangladesh Court Opens Murder case Investigation Against former PM Sheikh Hasina: రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పూర్తిగా కుదిపేసింది. ఏకంగా మాజీ ప్రధాని షేక్ హసీనా కట్టుబట్లలతో బంగ్లా వదిలివెళ్లేలా చేసింది. ఇప్పటికే ఈ అల్లర్లలో ఐదువందల మందికిపైగా అమాయకులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందారు. ఇదిలా ఉండగా.. షేక్ హసీనాకు పై హత్య కేసును బంగ్లా పోలీసులు నమోదు చేశారు.

ఆమెతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మొహమ్మద్ పూర్ లోని ఒక కిరాణా దుకాణ యజమాని అబు సయ్యద్ ఈ అల్లర్లలో చనిపోయాడు. అతని మరణానికి షేక్ హసీనా నే కారణమంటూ కూడా, అబుసయ్యద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షేక్ హసీనాతో పాటు, మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో.. అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రెటరీ, ఒబైదుల్ క్వాడర్, మాజీ హొంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. 

బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తిలో పాల్గొన్న వారి కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని షేక్ హసీనా సర్కారు భావించింది. కానీ నిరుద్యోగులు దీనికి  ఒప్పుకోలేదు. ఇది కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతోప్రభుత్వం కాస్తంతా వెనక్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో నిరసనలు చిలికి, చిలికి గాలివానలాగా మారాయి.

Read more: Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..

ఏకంగా నిరసనకారులు పీఎం అధికారిక నివాసంలోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. దీంతో ఆర్మీ వారితో సంప్రదింపులు చేస్తుంది. మరోవైపు ఇటీవల ఆందోళనకారులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను, మిగతా న్యాయవాదుల్ని సైతం పదవుల నుంచి తప్పుకొవాలని సూచించింది. ఈనేపథ్యంలో షేక్ హసీనా ఈ అల్లర్ల వెనుక అమెరికా హస్తముందని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలని కూడా బంగ్లాదేశ్ లోని నేతలు భారత్ ను కోరారు. ఈ క్రమంలో షేక్ హసీనా పై ప్రస్తుతం హత్య కేసు నమోదు కావడంతో మరోసారి బంగ్లా రాజకీయాల అంశం హీట్ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News