India Post GDS Recruitment 2024: ఇండియా పోస్ట్ జీడీఎస్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది. గత నెలలో పోస్టాఫీస్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఎంతోమంది అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం పదో తరగతి అర్హతతో ఈ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ సందర్భంగా 12 సర్కిళ్లకు సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితా విడుదలైంది. ఇందులో మీరు ఉన్నారా? ఇలా వెంటనే చెక్ చేసుకోండి.
పోస్టాఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. 12 సర్కిళ్లకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, వెస్ట్ బెంగాళ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గుజరాత్, ఢిల్లీ, అసోం, పంజాబ్‌కు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ముందుగా విడుదల చేశారు. కేవలం పదో తరగతి అర్హత ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ జాబితాను సిద్ధం చేసింది. ఈ ఏడాది దాదాపు 44,228 గ్రామీణ డాక్ సేవ పోస్టులను 23 సర్కిళ్లలో చేపట్టాలని ఇండియా పోస్టు లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..
మిగతా సర్కిళ్లకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ మెరిట్‌కు సంబంధించిన వివరాలు Indiapostadsonline.gov.in ఉన్నాయి. అభ్యర్థులు ఇండియా పోస్ట్ ఆఫీస్ GDS మెరిట్ లిస్ట్‌ను 2024 దరఖాస్తు చేసుకున్నవారు వెంటనే చెక్ చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా డివిజనల్ హెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని అర్హతలు సరిపోతే అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వనున్నారు.
మెరిట్ జాబితా ఇలా చెక్ చేయండి..
Indiapostgdsonline.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
ఆ తర్వాత హోంపేజీలో " జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024: షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లింక్ పై క్లిక్ చేయండి
ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కూడా నమోదు చేయండి.
చివరగా సబ్మిట్ బట్టన్ ప్రెస్ చేయాలి
అప్పుడు మీకు ఓ డిస్‌ప్లే వస్తుంది దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్
శాలరీ..
గ్రామీణ్ డాక్ సేవక్‌లో రెండు పొజిషన్లకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ. 29,380-24,470 అందించనున్నారు. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రూ.10,000-రూ. 24,470, ఇందులో చౌకీదార్‌లకు అయితే రూ.20,000 ప్రతినెలా చెల్లించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter