సభలో హోదా రగడ; జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ప్రత్యేక హోదా పై జగన్ , చంద్రబాబు మధ్య మాటల యుద్ధం సాగింది

Last Updated : Jun 18, 2019, 06:49 PM IST
సభలో హోదా రగడ; జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఏపీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఇదే సమయంలో హోదా కోసం చంద్రబాబు తన ప్రయత్నాలను సమర్ధించుకున్నారు. ఈ క్రమంలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
ప్లానింగ్ కమిషన్ కు లేఖ ఎందుకు రాయలేదు - జగన్
ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన జగన్ .... చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకొని తనకు తాను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది... అది ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నించానా అని ప్రశ్నించుకోవాలి. అసలు చంద్రబాబు తీరు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని నిండు సభలో సీఎం జగన్ ఆరోపించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా కోరుతూ ప్లానింగ్ కమిషన్ కు ఒక్కసారి కూడా లేఖ రాయలేదన్నారు. గట్టిగా ప్రయత్నించి ఉంటే స్పెషల్ స్టేటర్ ఎప్పుడో వచ్చి ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు.
వైసీపీ వారు హోదా తెస్తే సంతోషిస్తాం - చంద్రబాబు
ప్రత్యేక హోద విషయంలో సీఎం జగన్ ఆరోపణలకు చంద్రబాబు సూటిగా సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాను ప్లానింగ్ కమిషన్ ఒప్పకోకపోవడం వల్లే దానిపేరు మార్చి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని చంద్రబాబు వివరించారు. హోదా విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని.. ఇదే అంశంపై  29 స్లార్లు ఢిల్లీకి వెళ్లామన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీగా ఇస్తామంటేనే తాము ఒప్పుకున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం తాము ఎప్పుడూ రాజీపడలేదన్నారు. ఏది ఏమైనప్పపటికీ హోదా సాధిస్తారని వైసీపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకే ప్రజలు వైసీపీ వారికి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు..ఇప్పుడు హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. హోదా తీసుకువస్తే తాము సంతోషిస్తామని చంద్రబాబు బదులిచ్చారు

Trending News