Yummy Mutton Cutlet Recipe: మటన్ రెసిపీలు తయారు చేసుకున్నప్పుడు స్నాక్ ,కర్రీ వంటివి తయారు చేసుకుంటాం.. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మటన్ ప్రియులకు పండగే మటన్ వివిధ రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే మటన్ తో కట్లెట్ ఎప్పుడైనా ప్రయత్నించారా? మనం ప్రసిద్ధ హోటల్ షెఫ్ అందించిన ఈ మటన్ కట్లెట్ రెసిపీ మనము తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు- 150 గ్రాములు
క్యారెట్లు -పావు కిలో
మటన్ -కేజీ
బ్రెడ్ క్రంబ్స్- 500 గ్రాములు
ఉడికించిన ఆలుగడ్డ- 300 గ్రాములు
జీలకర్ర -20 గ్రాములు
పసుపు -10 గ్రాములు
క్యాప్సికం -అరకప్పు
బీన్స్ -అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -50 గ్రాములు
ఉప్పు -రుచికి సరిపడా
నల్లమిరియాలు- ఒక టేబుల్ స్పూన్
గుడ్లు -2
మల్టీపర్పస్ ఫ్లోర్- 2 చెంచాలు
ఇదీ చదవండి: ఈ 8 అందమైన ప్రదేశాలు గోవాలోనే ఉన్నాయంటే మీరు నమ్మరు.. ఇవి చాలామందికి తెలియదు..
మటన్ కట్లెట్ తయారు చేసే విధానం
ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం పాటు బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
ఆ తర్వాత అందులో పసుపు వేసి కలపాలి ఇప్పుడు చిన్నగా కీమా మాదిరి కట్ చేసుకున్న మటన్ కూడా వేసి బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కట్ చేసిన కూరగాయలన్నీ వేసి బాగా కలుపుకొని నీరంతా ఇంకిపోయే వరకు బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిక్చర్ అంతా చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించిన ఆ బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలపాలి ఇప్పుడు ఓ గుడ్డు సపరేట్ బౌల్లో వేసి పిండితోపాటు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్‌లో వేసి కలపాలి.
ఇదీ చదవండి: జన్మాష్టమి సందర్భంగా పంచామృతం ఇలా తయారు చేసి కృష్ణయ్యకు సమర్పించండి..
ఈ మటన్ మిక్చర్ కట్లెట్ మాదిరి తయారుచేసుకొని ఆ బ్రెడ్ క్రంబ్స్ లో కోడ్ చేయాలి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసిపెట్టుకొని ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. దీనికి కెచప్‌తో వేడివేడిగా ఆస్వాదిస్తే అది రుచి అద్భుతంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook