Hajj 2025 New Rules: హజ్ యాత్రికుల కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది. 2025 హజ్ యాత్రకై ఆసక్తి చూపించే యాత్రికులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9 వరకు అవకాశముంటుంది. అయితే ఈసారి నిబంధనలు మారాయనేది గుర్తుంచుకోవాలి.
హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం హజ్ రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేసింది. కానీ కన్వీనియెన్స్ ఫీజును మాత్రం రెట్టింపు చేసింది. అంతేకాకుండా 65 ఏళ్లు దాటిన యాత్రికులు ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. మొన్నటి వరకూ ఈ పరిమితి 70 ఏళ్లు ఉండేది. ఇప్పుడు 5 ఏళ్లు తగ్గించి 65 ఏళ్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం హజ్ కమిటీ హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 9 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు రద్దు చేసింది. అదే సమయంలో 1000 రూపాయలుగా ఉన్న ఫెసిలిటీ లేదా కన్వీనియెన్స్ ఫీజును 2 వేలు చేసింది ప్రభుత్వం.
మరోవైపు హజ్ యాత్ర సమయంలో భార్యాభర్తలు ఒకే గదిలో స్టే చేయలేరు. ఈ నిర్ణయం సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాల ప్రకారం పురుషులు మహిళల గదిలో ప్రవేశించజాలరు. ఇప్పటి వరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రాల వారీగా పురుషులు, మహిళలు ఒకే గదిలో ఉండేలా ఏర్పాట్లు చేసేది. ఈసారి హజ్ కమిటీ జిల్లాల వారీగా ఒకే బిల్డింగ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేయనుంది. అయితే భార్యాభర్తలు ఒకే గదిలో ఉండలేరు కానీ పక్క పక్క గదుల్లో ఉండేట్టు చూస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook