Cervical Pain Remedies: ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అందులో ముఖ్యమైనవి డయాబెటిస్, బ్లెడ్ ప్రెషర్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటివి కీలకమైనవి. చాలామంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
సాధారణంగా మనం చేసే ఉద్యోగాలే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయి. గంటల తరబడి కదలకుండా చేసే ఉద్యోగాల వల్ల చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి కాగా మరికొన్ని గంభీరమైనవి. ముఖ్యంగా మెడ పట్టేయడం, భుజాల్లో నొప్పి తీవ్రంగా బాధిస్తుంటుంది. ఈ నొప్పి క్రమంగా వీపు, నడుము వరకూ వ్యాపిస్తుంది. దీనినే సర్వైకల్ పెయిన్ అంటారు. ఈ సమస్యకు కారణమేంటి, ఎలా బయటపడాలో పరిశీలిద్దాం. సర్వైకల్ పెయిన్ ్నేది గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ప్రధానంగా వస్తుంది. తల కిందకు వంచి పని చేస్తుండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. పెరిగే వయస్సు, తలపై భారం కూడా ఓ కారణం. ఎత్తైన తలదిండు వేసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. పడుకునేటప్పుడు మెడ సరిగ్గా లేకపోడవం లేదా ఏదైనా ప్రమాదంలో గాయం కారణంగా ఈ సమస్య రావచ్చు
మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి క్రమంగా భుజాలు, వీపు వరకూ వ్యాపిస్తుంది. ఒక్కోసారి మెడ తిప్పడం కూడా సమస్యగా మారుతుంది. నొప్పి, మెడ పట్టేయడంతో పాటు స్వెల్లింగ్ అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోకూడదు. పనిచేసేటప్పుడు మెడ అటూ ఇటూ తిప్పుతుండాలి. తలగడ లేకుండా పడుకోవడం మంచిది. నొప్పి, స్వెల్లింగ్ నుంచి రిలీఫ్ కోసం హాట్ వాటర్ బ్యాగ్‌తో కాచుకోవాలి. లేదా మాలిష్ చేయించుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా మెడ వ్యాయామం చేయాలి
ఈ సమస్య మరింతగా పెరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. అవసరమైతే ఫిజియోధెరపీ చేయించుకోవాలి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. పనిచేసేటప్పుడు మద్యమద్యలో అటూ ఇటూ తిరగడం మంచిది. దీనివల్ల మెడ పట్టడం ఉండదు.
Also read: Anjeer Side Effects: అంజీర్‌తో లాభాలే కాదు.. దుష్పరిణామాలు కూడా ఉంటాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.