Earth Turn: భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా? పుస్తకాల్లో చదివిన ఖగోళ పాఠం వీడియో రూపంలో

Earth Rotating Video Goes Viral: పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాలు దృశ్యరూపకంగా ఉంటే సులువుగా అర్థమవుతాయి. అలాంటి ఖగోళ దృశ్యమే వెలుగులోకి వచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 4, 2024, 02:30 PM IST
Earth Turn: భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా? పుస్తకాల్లో చదివిన ఖగోళ పాఠం వీడియో రూపంలో

Viral Video: చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం భూమి తిరుగుతుందని.. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతందని పాఠాలు విన్నాం. కానీ ఏనాడూ భూమి తిరిగే దృశ్యాలను చూడలేదు. భూమి తిరగడం ఒక్కసారి చూడాలని భావిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. భూమి తిరుగుతున్న అద్భుతమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కెమెరాలోని టైమ్‌ ల్యాప్స్‌ సహకారంతో వీడియో చిత్రీకరించగా అందులో భూమి తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఆ వీడియో పాతదైనా ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది.

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

టైమ్‌ ల్యాప్స్‌ అనే ఆప్షన్‌ కెమెరాలో ఉండే విషయం మీకు తెలిసిందే. స్లో మోషన్‌ ఫొటోలు, వీడియోలు తీసి ప్లేబ్యాక్‌ చేయడం టైమ్‌ ల్యాప్స్‌ ద్వారా సాధ్యమవుతుంది. టైమ్స్‌ ల్యాప్స్‌ ద్వారా తీసిన వీడియోలు నిమిషాలు, గంటల నిడివి ఉన్న దృశ్యాలను తక్కువ సమయంలో చూపిస్తాయి. ఇవి ప్రకృతి అందాలు.. సృష్టి అందాల్లో జరుగుతున్న మార్పులు చూడడానికి దోహదం చేస్తాయి. అలా భూమి తిరుగుతున్న వీడియోను టైమ్‌ ల్యాప్స్‌ ద్వారా చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

2022 ఆగస్టులో దక్షిణ ఫ్రాన్స్‌లోని కాస్మోడ్రోమ్‌ అబ్జర్వేటరిలో తీసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో భూమి తిరుగుతున్న దృశ్యాలు అద్భుతంగా కనిపించాయి. భూమి కాంతి కారణంగా వీడియోలో పాలపుంత కనిపించలేదు. నక్షత్రాలు స్థిరంగా ఉన్నప్పుడు చెట్లు, మొక్కలు, పొలాలతో పాటు భూమి కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో 'వండర్‌ ఆఫ్‌ సైన్స్‌' తన సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసింది. ఈ వీడియోను చూసిన సైన్స్‌ ప్రియులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇన్నాళ్లు పాఠ్య పుస్తకాల్లో చదివిన పాఠాలు ఇలా దృశ్యరూపంగా కనిపించడం వావ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'అద్భుతం' అని చెబుతున్నారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ అని పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News